Temple Cities Investment: భారత దేశంలో ఒకప్పుడు ఆధ్యాత్మిక నగరాల సందర్శన కేవలం వృద్ధాప్యంలో లేదా పుణ్యం కోసం వెళ్లే యాత్రలకు పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇప్పుడు మల్టీ మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్, తిరుపతి, పూరీ వంటి నగరాల్లో మౌలిక వసతుల విప్లవం తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా టెంపుల్ సిటీల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే, సెలబ్రిటీలను చూసి సామాన్యులు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చా, ఈ మార్కెట్ వెనుక ఉన్న రిస్కులు ఏంటి?ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక నగరాల్లో ముఖ్యంగా అయోధ్యలో సెలబ్రిటీల ల్యాండ్ డీల్స్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. సుమారు రూ.14.5 కోట్లతో 10 వేల చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేశారు. అయోధ్యలోని అదే ప్రాజెక్టులో బాలీవుడ్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్ ఇటీవలే రూ.3.31 కోట్లతో 2,134 చదరపు అడుగుల ప్లాట్ కొన్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు, పారిశ్రామికవేత్తలు వారణాసి, హరిద్వార్, పూరి, మథుర వంటి ప్రాంతాలలో కమర్షియల్ స్థలాలు, హోటళ్లు, రిసార్ట్స్ కోసం భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు పెరిగేందుకు కారణాలుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆధ్యాత్మిక నగరాల కనెక్టివిటీని భారీగా పెంచాయి. కొత్త ఎయిర్ పోర్టులు, వందే భారత్ రైళ్లు, ఫోర్ లేన్ హైవేల వల్ల పర్యాటకుల సంఖ్య కోట్లలోకి చేరింది. కేవలం భక్తులే కాకుండా స్పిరిచువల్ టూరిజం కోసం వచ్చే యువత, ఎన్ఆర్ఐల సంఖ్యా భారీగా పెరిగింది. దీనివల్ల హోటళ్లు, హోమ్ స్టేలు, లాడ్జీలకు డిమాండ్ పెరిగి, ల్యాండ్ విలువ 2-3 ఏళ్లలోనే కొన్ని ప్రాంతాల్లో 100 శాతం నుంచి 300 శాతం వరకు పెరిగింది. సెలబ్రిటీలను చూసి సామాన్యులూ కొనవచ్చా?వెంటనే అక్కడ పెట్టుబడిగా పెట్టడం సరికాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీల వద్ద ఉండే అదనపు సంపద వేరు, మన బడ్జెట్ వేరు. సెలబ్రిటీలు చాలా వరకు లాంగ్ టర్మ్ లేదా కేవలం ఒక స్టేటస్ సింబర్ లేదా సెలవుల్లో గడపడానికి స్థలాలు కొనుగోలు చేస్తుంటారు. ఒక వేళ సామాన్యులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కేవలం ధరలు పెరుగుతాయి అనే ఊహాగానాలతో కాకుండా అక్కడ స్థిరమైన అద్దె ఆదాయం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాలంటున్నారు. టెంపుల్ సిటిల్లో ఉండే రిస్కులుఆధ్యాత్మిక నగరాల్లో హఠాత్తుగా వచ్చిన హైప్ వల్ల కొన్ని చోట్ల భూముల ధరలు వాటి అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. భవిష్యత్తులో ఈ మార్కెట్ స్థిరపడితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పాత పుణ్యక్షేత్రాల చుట్టూ ఉండే భూములకు సరైన డాక్యుమెంట్లు ఉండకపోవచ్చు. అవి దేవాలయాల ఆస్తులు లేదా వంశపారంప్రయ ఆస్తులూ అనే వివాదాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు అవసరానికి వెంటనే ల్యాండ్ అమ్ముదామన్నా కొనేవారు దొరకకపోవచ్చు. అందుకే ఆధ్యాత్మిక నగరాల్లో పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచనే అయినప్పటికీ రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం. రేరా గుర్తింపు పొందిన పెద్ద బిల్డర్ల ప్రాజెక్టులలో మాత్రమే ప్లాట్లు లేదా అపార్ట్‌మెంట్లు కొనడం సురక్షితం. అలాగే కనీసం 5 నుంచి 01 సంవత్సరాల దీర్ఘకాలిక లక్ష్యంతో, వివాదాలు లేని క్లియర్ టైటిల్ ఉన్న భూములను ఎంచుకుంటేనే టెంపుల్ టౌన్స్ లో లాభాలు అందుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.