US - IRAN యుద్ధంపై ట్రంప్ బిగ్ అనౌన్స్‌మెంట్.. డీల్ సెట్ చేసిన డాన్ ట్రంప్!

Wait 5 sec.

ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన అమెరికా - ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడనుంది. కాల్పుల విరమణ తర్వాత మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేత తర్వాత ఇరాన్‌పై యూఎస్ ఆర్మీ వరుస మిసైళ్ల దాడి చేపట్టింది. దాంతో పరిస్థితి చేదాటిపోతుందని అందరూ అనుకున్నారు. ఆలోపే అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం ఆదివారం కుదరనుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్లు నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం విశేషం. శాంతి ఒప్పందం ఆదివారం కుదరనుందని చెప్పిన ట్రంప్.. ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని.. అన్ని దేశాలు వ్యాపారం చేసుకోవచ్చని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "రేపు సంతకం చేయడానికి డీల్ షెడ్యూల్ అయింది. అది పూర్తయిన వెంటనే హోర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ డీల్‌కి మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యవహరించింది. ట్రంప్ ఈ ప్రకటన చేసే ముందుగానే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా - ఇరాన్ ఒప్పందం త్వరలోనే కుదురుతుందని ప్రకటించారు. ఇరాన్ మరో స్వరంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇరాన్ స్పందించడం విశేషం. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ మాట్లాడుతూ ఆదివారం డీల్ కుదిరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ కూడా ఒప్పందం త్వరలోనే కుదరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, గతంలో కూడా ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం దాదాపు పూర్తయిందని వార్తలు వచ్చినా.. ఆఖరి నిమిషంలో బెడిసి కొట్టాయి. అమెరికా శాంతి ఒప్పందంపై పట్టుబడుతున్నప్పటికీ.. ఇరాన్ మాత్రం కొన్ని కండీషన్స్‌కి ఒప్పుకోవడం లేదు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధి చుట్టుూ నెలకొన్న ఉద్రిక్తతే ఈ యుద్ధానికి ప్రధాన కారణంగా మారాయి. మరి ఈ ఆదివారం డీల్‌తో అయినా అమెరికా - ఇరాన్ యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉందేమో చూడాలి.