రూ.7.24 లక్షలకే 'E85 పెట్రోల్‌'తో నడిచే కారు.. చిన్న ఫ్యామిలీకి బెస్ట్.. మారుతీ సుజుకీ ధరల వెల్లడి!

Wait 5 sec.

Flex Fuel Car: ఇప్పుడు ఎక్కడ చూసిన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది 2026, ఏప్రిల్ 1 నుంచే ఈ20 పెట్రోల్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ50, ఈ85, ఈ100 పెట్రోల్ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను తయారు చేయాలని ఇప్పటికే కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగన్ ఆర్ బయో ఫ్లెక్స్ కారును ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసింది. జూన్ నెల ప్రారంభంలోనే ఈ కారును ధర, ఇతర వివరాలేవీ లేకుండా లాంచ్ చేసింది. అయితే తాజా ఈ బయో ఫ్లెక్స్ కారు ధరను వెల్లడించింది. ప్రారంభమవుతున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. అదే పెట్రోల్ వేరియంట్ వ్యాగన్ ఆర్ కారు టాప్ మోడల్‌ ధరతో పోలిస్తే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ధర రూ.86 వేలు అధికంగా ఉంది. ఈ కారు E20 నుంచి E85 వరకు పెట్రోల్‌లో ఇథనాల్ కలిపిన మిశ్రమంతో నడుస్తుందని మారుతీ సుజుకీ తెలిపింది. అయితే, బయో ఫ్లెక్స్ వెర్షన్‌ను తొలుత కమర్షియల్ వినియోగానికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఈ చిన్న కారు చిన్న ఫ్యామిలీ కోసం మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.ప్రస్తుతం క్యాబ్ కోసం ప్రత్యేకంగా వ్యాగన్ ఆర్ టూర్ H3 కారును మారుతీ సుజుకీ మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్‌తో నడిచే ఈ కారు ధర రూ.4.99 లక్షల నుంచి రూ.5.89 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) వరకు ఉంటుందని తెలిపింది. అయితే ఈ పెట్రోల్ కారు ధరతో పోలిస్తే ఉంటుందని పేర్కొంది. ఇక ఈ వ్యాగన్ ఆర్ బయో ఫ్లెక్స్‌లో 1.2 లీటర్ కే12ఎన్ 4 సిలిండర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. అధిక స్థాయుల్లో ఇథనాల్ కలినా నడిచేలా ఇంజిన్‌లో మార్పులు చేశారు. పవర్, టార్క్ ఔట్‌పుట్‌లో ఎలాంటి మార్పూ చేయలేదు. 90.9 హెచ్‌పీ పవర్‌ను 113.7 ఎన్ఏ టార్‌ను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుందని మారుతీ సుజుకీ తెలిపింది. అయితే, మైలేజ్ ఎంత ఇస్తుందనే వివరాలను ఇంకా బహిర్గతం చేయలేదు.