కోటక్ కంపెనీ చరిత్రలోనే తొలి SIF స్కీమ్ లాంచ్.. ఈనెల 29 వరకే ఛాన్స్.. కనీస పెట్టుబడి ఎంతంటే?

Wait 5 sec.

Kotak Mutual Fund: దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైనా కోటక్ మ్యూచువల్ ఫండ్ మొట్టమొదటిసారిగా (SIF) స్కీమ్ లాంచ్ చేసింది. కోటక్ ఇన్ఫినిటీ హైబ్రిడ్ లాంగ్- షార్ట్ ఫండ్ (Kotak Infinity Hybrid Long Short Fund)పేరుతో ఈ ఎస్ఎఫ్ఐ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైంది. జూన్ 15, 2026 సోమవారం నుంచే ఇందులో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 29, 2026వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది. మరి ఈ స్కీమ్ కనీస పెట్టుబడి, ఈ కొత్త తరహా ఫండ్స్ గురించి తెలుసుకుందాం. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (SIF) అనేది కొత్త తరహా పెట్టుబడి విధానం. విభిన్నమైన ఉత్పత్తులను అందిస్తూ మరింత స్వేచ్ఛగా ఫండ్స్‌ను నిర్వహించే అవకాశాలను ఈ స్కీమ్ కల్పిస్తుంది. డెరివేటివ్స్ వంటి అడ్వాన్స్డ్ టూల్స్ ఇందులో ఉపయోగిస్తారు. పెట్టుబడి పెటేటేందుకు సౌకర్యంగా ఉంటుంది. రిస్క్ సామర్థాన్ని బట్టి తమకు అందే రిటర్న్స్ ఉంటాయి. ఈ కొత్త తరం ఫండ్ అనేది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికే అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.10 లక్షలుగా ఉంటుంది. ఆ తర్వాత రూ.1 చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లవచ్చు. సబ్‌స్క్రిప్షన్ జూన్ 29వ తేదీన ముగిసిన తర్వాత మళ్లీ జూలై 9, 2026 నుంచి క్రయ విక్రయాలకు ఓపెన్ మార్కెట్లకి తీసుకొస్తారు.కోటక్ మ్యూచువల్ ఫండ్ తెచ్చిన ప్రధానంగా లాంగ్ టర్మ్‌లో మూల ధన లాభాలను అందించాలనే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్కీమ్ పెట్టుబడి డబ్బులను స్టాక్స్, స్టాక్స్ అనుబంధ మార్గాలతో పాటుగా బాండ్లు, మనీ మార్కెట్ టూల్స్‌లో పెట్టుబడిగా పెడుతుంది. అలాగే స్టాక్స్‌లో కొన్ని షార్ట్ పొజిషన్లను కొనుగోలు చేస్తుంది. డెరివేటివ్స్ వంటి స్పెషల్ టూల్స్ ఉపయోగించి స్టాక్స్, బాండ్లలో పెట్టుబడిగా పెడతారు. ఈ ఫండ్ బెంచ్ మార్క్ నిఫ్టీ 50 హైబ్రిడ్ కంపోజిట్ డెట్ 50:50 ఇండెక్స్ (NIFTY 50 Hybrid Composite Debt 50:50 Index) ఉంటుంది. ఈ ఫండ్‌ని హితేశ్ షా, కల్పేశ్ జైన్, అభిశేక్ బైసెన్‌లు నిర్వహిస్తారని కోటక్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.'మరింత సౌకర్యవంతమైన విధానాన్ని అందిస్తాయి. ఇన్ఫినిటీ హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్, ఈక్విటీలు, ఆర్బిట్రేజ్ అవకాశాలు, ఎంపిక చేసిన డెరివేటివ్ వ్యూహాలలో పెట్టుబడి పెడుతుంది, నికర ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను డైనమిక్‌గా నిర్వహిస్తుంది. అస్థిర పరిస్థితులలో నష్టాలను తగ్గించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటూ, మార్కెట్ పెరుగుదలలో పాలుపంచుకోవడమే దీని ఉద్దేశం. పెట్టుబడిదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా, వారికి ఉపయోగపడే పెట్టుబడి పరిష్కారాలను రూపొందించడంపై కోటక్ మ్యూచువల్ ఫండ్ నిరంతరం చూపుతున్న శ్రద్ధకు ఈ కొత్త తరం ఫండ్ ప్రారంభం ఒక నిదర్శనం.' అని ఫండ్ మేనేజర్ కల్పేశ్ జైన్ పేర్కొన్నారు.