నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష రాసే విద్యార్ధులకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాసే విద్యార్థులు తమ పరీక్ష హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. అలాగే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైతే అదనపు సర్వీసులు నడపాలన్నారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. ఏయే బస్సులలో ఉచితమంటే..నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి.. ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ మేరకు అన్ని డిపోలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సూపర్ వైజర్లను నియమించి అవసరమైతే అదనపు బస్సులు నడిపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బస్ స్టేషన్లలోనూ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయనున్నారు.జూన్ 21న నీట్ రీ- ఎగ్జామ్.. టెలిగ్రామ్ బ్లాక్మరోవైపు కావటంతో దానిని రద్దు చేశారు. దేశవ్యాప్తంగామరోసారి నిర్వహిస్తున్నారు. పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావటంతో ఈసారి ఎలాంటి లోపాలు, అక్రమాలకు తావులేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా జూన్ 22వ తేదీ వరకూ చేసింది. అలాగే జూన్ 30వ తేదీ వరకూ టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ డిసేబుల్ చేసేలా సదరు కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి ప్రచారాన్ని వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.