పవన్ కళ్యాణ్ పనితీరుకు కేంద్ర మంత్రి ఫిదా.. తన నియోజకవర్గంలోనూ ఫాలో అవుతానన్న శివరాజ్ సింగ్ చౌహాన్..

Wait 5 sec.

.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న, నీటి తొట్టెల నిర్మాణం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రశంసించారు. మ్యాజిక్ డ్రెయిన్స్ నిర్మాణ విధానం తనకు నచ్చిందని, దీనిని తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అమలు చేసేలా అధికారులకు సూచిస్తానన్నారు. అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్‌ను కేంద్ర మంత్రి అభినందించారు.ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి పవన్ కళ్యాణ్ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వివరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నిరంతరం అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. VB - GRAMG పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధులు రాష్ట్రంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, సామాజిక అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయన్నారు పవన్ కళ్యాణ్.ఇక పవన్ కళ్యాణ్‌తో భేటీ సందర్భంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం అమలు వినూత్న కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయటంతో పాటు, సోషల్ ఆడిట్ యంత్రాంగాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇక వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే నెలల్లో పశువుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'నీటి తొట్టెలు' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రిని ప్రశంసించారు.ఈ క్రమంలోనే పెద్దపెంకి గ్రామంలో అమలు చేసిన 'మ్యాజిక్ డ్రెయిన్స్' నిర్మాణం గురించి పవన్ కళ్యాణ్ వివరించగా.. ఈ విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. పారిశుధ్యం, మురుగునీటి పారుదల నిర్వహణ, ప్రజారోగ్యంపై మ్యాజిక్ డ్రెయిన్స్ మంచి ప్రభావం చూపిస్తాయన్న ఆయన.. గ్రామీణ భారతదేశానికి ఒక ఆచరణాత్మక, తక్కువ ఖర్చుతో కూడిన నమూనాగా అభివర్ణించారు. మధ్యప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా దీనిని అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తానని తెలిపారు.