Elon Musk: అపర కుబేరుడు, ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద నానాటికీ భారీగా పెరుగుతోంది. ఆయన సంస్థ దీంతో ఆయనకు భారీ లాభాలు వస్తున్నాయి. ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు స్పేస్ ఎక్స్ () వచ్చిన సంగతి తెలిసిందే. ఇష్యూ ధర 135 డాలర్లుగా ఉండగా భారీ లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టడమే కాదు ఇప్పుడు 200 డాలర్లు దాటేసింది. దీంతో మస్క్ సంపదను ఇతర కుబేరుల సంపదతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే, ఆ గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.పబ్లిక్ ఇష్యూ తర్వాత మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. ఒక ట్రేడింగ్ సెషన్‌లో 14.71 శాతం ర్యాలీ చేశాయి. దీంతో ఆయన సంపద ఒక్కరోజులోనే ఏకంగా 164.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ ఒక్కరోజులో ఆయనకు వచ్చిన లాభమే భారతదేశంలోని అత్యంత కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ సంపద 89.7 బిలియన్ డాలర్ల కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ప్రస్తుతం ఎలాన్ మస్క్ నికర సంపద 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. టెస్లా, స్పేస్ ఎక్స్ లో ఆయనకు ఉన్న వాటాలే ఇందుకు ప్రధాన కారణం.మరోవైపు మస్క్ షేర్లు పెరిగిన రోజున ముకేశ్ అంబానీ స్టాక్స్ సైతం రాణించాయి. దీంతో అంబానీ నికర ఆస్తుల విలువ 1.09 శాతం పెరిగి 96.5 బిలియన్ డాలర్లకు చేరింది. మామూలుగా అయితే ఈ లెక్కలు అద్భుతమైనవే అయినా ఎలాన్ మస్క్ ఒక్క రోజులో పొందిన లాభంతో పోలిస్తే మాత్రం చాలా తక్కువగా ఉండడం గమనార్హం. భారతదేశ జీడీపీ విలువ 4.15 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా మస్క్ వ్యక్తిగత సంపద నాలుగో వంతుకు సమానమని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో నాస్‌డాక్‌లో స్పేస్ ఎక్స్ షేరు 150 డాలర్ల వద్ద లిస్టింగ్ అయింది. పబ్లిక్ ఇష్యూ ధర 135 డాలర్లతో పోలిస్తే ఇది 11 శాతం ప్రీమియం. ఈ కంపెనీలో ఎలాన్ మస్క్‌కు 480 కోట్ల షేర్లు ఉన్నాయి. దీంతో అయితే ఆయన సంపదపై లోతైన చర్చ జరుగుతోంది. ప్రతి గంటకు ఒక మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ వెళ్లినా 2140 సంవత్సరం వరకు మస్క్ సంపద తరిగిపోదని, ఇంకా మిగిలే ఉంటుందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.