Body:ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత ఏ జట్టు.. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠపోరులో పరాజయం పాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. కానీ సూపర్‌ ఓవర్‌లో భారత్ ఓడిపోయింది. అయితే ఇది జరిగిన తర్వాత వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ప్లేయర్లు టార్గెట్ చేశారు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. లంక ప్లేయర్ ఛాతీపై చేయి నెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అసలేం జరిగిందంటే..ఈ మ్యాచులో ఇరు జట్లూ 50 ఓవర్లు ముగిసే సరికి 265 పరుగులు చేశాయి. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు అంపైర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16 రన్స్ చేసింది. భారత్ తరఫున సుయాంశ్, ఓపెనర్లుగా వచ్చారు. తొలి మూడు బంతులకు కేవలం మూడు రన్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత వైభవ్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. కానీ మూడు బంతుల్లో 6 పరుగులే చేశాడు వైభవ్. ఫలితంగా భారత్ మ్యాచులో ఓడిపోయింది.ఇది జరిగిన తర్వాత భారత ఓపెనర్లను ఉద్దేశించి శ్రీలంక ప్లేయర్లు ఎగతాళి చేస్తూ ఏదో అన్నారు. వెంటనే సుయాంశ్ లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. శ్రీలంక ఆటగాళ్ల చేష్టలతో కట్టలు తెంచుకుంది. దీంతో గొడవలోకి అతడు కూడా వెళ్లాడు. శ్రీలంక ప్లేయర్ ఛాతీపే చేయి వేసి నెట్టాడు. శ్రీలంక క్రికెటర్ కూడా ప్రతిఘటించడంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల్లా మధ్యలో జోక్యం చేసుకుని.. వైభవ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. కాసేపటికి ఇరు జట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.ఇది జరిగిన తర్వాత వైభవ్ శాంతించలేదు. పెవిలియన్ వైపు వెళ్తూ శ్రీలంక ఆటగాళ్లను చూస్తూ ఏదో వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కామెంట్లు చేస్తున్నారు.