వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు షాక్.. మరో కేసు నమోదు..

Wait 5 sec.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. లో బొల్లా మంజూరుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రహ్మనాయుడుపై మరో కేసు నమోదైంది. గండిపేట భూమి కబ్జా యత్నం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో బ్రహ్మనాయుడు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జూన్ 20వ తేదీన శనివారం నరసరావుపేట నుంచి వినుకొండకు వైసీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అయితే బ్రహ్మనాయుడు ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిందని.. ముందుగా అనుమతి తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారంటూ వినుకొండ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.మరోవైపు బొల్లా బ్రహ్మనాయుడు ర్యాలీ సందర్భంగా పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ర్యాలీ సమయంలో సీఐ ప్రభాకర్ రావు బొల్లా బ్రహ్మనాయుడు కాన్వాయిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడు కాన్వాయిని బ్రాహ్మణపల్లి వైపు పోలీసులు మళ్లించటంతో ఉద్రిక్తతలు తగ్గాయి. అనంతరం సభలో పాల్గొన్న బొల్లా బ్రహ్మనాయుడు.., తనను ఇరికించారని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై సంచలన ఆరోపణలు చేశారు. తాను అరెస్ట్ కావటానికి 5 రోజుల ముందు ఎంపీ తనను అరెస్ట్ చేయిస్తామని అన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భూకబ్జాలపై చర్చకు సిద్ధమా అంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు సవాల్ విసిరారు. లావు శ్రీకృష్ణదేవరాయలకు రాజకీయ భిక్ష పెట్టింది వైసీపీనన్న బ్రహ్మనాయుడు.. గెలిపించిన వైసీపీ కార్యకర్తలు, నేతలను మోసం చేశారని ఆరోపించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు లెక్క పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని తాను కాదని.. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వైసీపీలోనే ఉంటానని బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. గండిపేట భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.