చేతులారా మ్యాచ్‌ చేజార్చుకున్న భారత్.. ఇకపై ప్రతి మ్యాచ్ డూ-ఆర్-డై..!

Wait 5 sec.

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు వరుస విజయాలతో దక్షిణాఫ్రికా బ్రేక్ వేసింది. ఆదివారం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచులో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన మారిజాన్నే కాప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓ దశలో 5.3 ఓవర్లలో 54/1తో నిలిచిన భారత్.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ 15 బంతుల్లో 31 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 29, హర్మన్ ప్రీత్ కౌర్ 22 రన్స్ చేశారు.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఓ దశలో 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సరికి 25/2తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో భారత్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ ఇలాంటి సమయంలోనే ప్రొటీస్ సీనియర్ ప్లేయర్ మారిజాన్నే కాప్.. సంచలన బ్యాటింగ్ చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. తంజిమ్ బ్రెట్స్ (36 బంతుల్లో 40 రన్స్)తో కలిసి మూడో వికెట్‌కు 63 బంతుల్లో 97 రన్స్ జోడించి.. మ్యాచ్‌ను మలుపుతిప్పింది. 45 బంతుల్లో 81 రన్స్ చేసి అజేయంగా నిలిచి, జట్టును గెలిపించింది. భారత బౌలర్లలో 3 వికెట్లు తీసింది. షెఫాల్ వర్మ ఒక వికెట్ పడగొట్టింది.ఈ మ్యాచులో క్యాచ్‌లు డ్రాప్ చేయడం కూడా భారత్ ఓటమిని శాసించింది. మారిజాన్నే కాప్ ఇచ్చిన రెండు క్యాచులను భారత ప్లేయర్లు జారవిడిచారు. దీంతో కాప్.. అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించింది. టీమిండియా తన తర్వాతి మ్యాచులో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో తలపడనుంది. ఇతర జట్లు ఫలితాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ చేరాలంటే.. భారత్ ఈ రెండు మ్యాచులలోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంది. ఒక్క మ్యాచులో ఓడినా.. సెమీస్ అవకాశాలు గల్లంతు అవుతాయి.