Gnaneswari Missing Mystery: బొమ్మలు, మాంసం.. వ్యూహం మార్చిన పోలీసులు

Wait 5 sec.

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన ఆచూకీ ఇంకా తెలియలేదు. జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నా పాప జాడ తెలియకపోవటంపై ఆందోళన నెలకొంది. చిన్నారి కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేక క్రూరమృగాలు ఏవైనా లాక్కెళ్లాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో.. పాప విసురుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యూహం మార్చారు. జ్ఞానేశ్వరి కుటుంబం నివసిస్తున్న తోట, కొండ ప్రాంతం సరిహద్దు వద్ద ఉన్న ఇనుప కంచెకు బొమ్మలను ఏర్పాటుచేశారు. చిన్నారి ఆకారాన్ని పోలిన బొమ్మలలో మాంసాహారం ఉంచి.. కంచె వద్ద ఏర్పాటు చేశారు.చిన్నారిని క్రూర జంతువులు లాక్కెళ్లి ఉండవచ్చనే అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో ఏవైనా అడవి జంతువులు ఉంటే.. మాంసాహారం వాసన పసిగట్టి బొమ్మలవైపు వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు. ఇక జంతువుల కదలికలను పసిగట్టేందుకు వీలుగా కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే థర్మల్ డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాలను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఎలాంటి జంతువుల కదలికలను కూడా గుర్తించలేదని సమాచారం. జూన్ నెల ఆరో తేదీ జానూ కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వందల మంది పోలీసులు పాప ఆచూకీ కోసం గాలిస్తున్నా కూడా.. చిన్న ఆధారం కూడా కనిపించకపోవటం మిస్టరీగా మారింది. జ్ఞానేశ్వరి కుటుంబం నివశిస్తున్న తోటతో పాటుగా ఆ పక్కనే ఉన్న కొండ ప్రాంతాన్ని అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాలు, ఫోన్‌ కాల్స్ వంటి సాంకేతికత ఉపయోగించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ పాప జాడ కనిపెట్టలేకుండా ఉండటంతో.. చిన్నారి ఏమైందోననే ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది.