జోత్స్న కొట్టిన జలక్‌తో తలపట్టుకుని కూర్చొంటాడు సూరజ్. "రేయ్ పొగరుబోతోడా.. లోపల జరిగిందానికి తల పగిలిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక తల బద్దలవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కాఫీ చాలా చాలా అవసరం. తాగు.. తాగు అని పొగరు చూపిస్తుంది జోత్స్న. సూరజ్ సైలెంట్ అయిపోతాడు. మాట అనగానే వెంటనే కౌంటరిస్తావు కదా.. ఈసారి ఏమైంది? గొంతులో నుంచి మాట బయటకు రావడం లేదు.. పాపం మీకు ఇది కష్టకాలమే.. ఇంతపెద్ద మోసాన్ని తట్టుకోవడం కష్టమే.. అమాయకంగా భలే మోసపోయార్రా" అంటూ నవ్వుతుంది జ్యోత్స్న. "మోసపోలేదు.. మోసం చేశారు.. బయటివాళ్లు కాదు.. తెలిసినవాళ్లే" అని అంటాడు సూరజ్. "అదే ఎవరూ అని అడుగుతున్నాను " అంటుంది జ్యోత్స్న. "నువ్వే.. గెలవడానికి నువ్వు ఎంత నీచానికైనా దిగజారిపోతావని ఆ మాణిక్యం గాడి గొడవలో అర్థమైంది" అంటాడు సూరజ్. "ఏంట్రా వాగుతున్నావు. సాక్ష్యం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడవంటే" అంటుంది జ్యోత్స్న. "ఏం చేస్తావు " అంటాడు సూరజ్. "నేనేం చేయాల్సిన అవసరం లేదు రా. మీ చావును మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఐదవ తరగతి పూర్తి చేయని ఆ వంటలక్క ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అవుతుందంటే నువ్వేలా నమ్మావు రా. ఇంత చదువుకున్నావు.. వెనకముందు ఆలోచించకుండా దానికి సాయంగా ఎలా వచ్చావు" అంటుంది జ్యోత్స్న. " నీ సలహాలు, నీ సూచనలు నాకేం అవసరం లేదు. గెట్ లాస్ట్ "అంటాడు సూరజ్. "సలహాలు కాదు కానీ.. నీకు రెండు ఆఫర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒకటి మీరు ఎలాగు ఓడిపోయారు కాబట్టి ఈవినింగ్ లోపు ఇక్కడి నుంచి సైలెంట్ గా పారిపోవడం. రెండు నాతో చేతులు కలుపు. నువ్వేలాగు జాదుగాడివి. లేని దెబ్బలు ఉన్నట్లు నటించి దీపను, మా బావను కూడా మోసం చేశావు. ఆ మాటకు వస్తే మా ఫ్యామిలీని కూడా చీట్ చేసి మా ఇంట్లోనే అవుటవుజ్ లో సెటిల్ అయ్యావు. నేను ఎలాంటిదానినో కూడా నీకు తెలుసు కాబట్టి నాతో చేతులు కలిపితే నీకు మంచి పోస్ట్ ఇస్తాను. నా ఆఫీసులో" అంటుంది జ్యోత్స్న. "నేను ఎవరి కింద పనిచేయను" అంటాడు సూరజ్. "నాతో కలిసి పనిచేయ్" అంటుంది జ్యోత్స్న. "దానికి ఒక అర్హత ఉండాలి " అంటాడు సూరజ్. "ఇచ్చే వాడి అర్హత గురించి మాట్లాడే రైట్ ఉండదు" అంటుంది జ్యోత్స్న. "నా ఓటమిని నేను డిసైడ్ చేయాలి. నువ్వు కాదు" అంటాడు సూరజ్. "ఎందుకురా నీకు అంత పొగరు. అసలు నీకు అర్థమవుతుందా.. నువ్వు దీప, ఒకడి చేతిలో మోసపోయారు. లెక్కలు రాస్తే నష్టం 20 లక్షలకు పైనే ఉంటుంది. మా ఇంట్లో జీతం లేని పనిమనిషిలా బతుకుతుంది ఆ దీప. ఈ 20 లక్షల అప్పును కష్టపడి తీర్చాలంటే దాని జీవితం సరిపోదు. దానికోసం నువ్వెందుకు నీ లైఫ్ ను నాశనం చేసుకుంటావు. ఒకటి పారిపోవడం. రెండు నా ఆఫర్ ఒప్పుకోవడం తప్పా నీకు వేరే దారి లేదు రా" అంటుంది జ్యోత్స్న. "కాఫీ బాగుంది థాంక్యూ" అంటాడు సూరజ్ కాఫీ తాగుతూ. "నేను చెప్పేది నీకు అర్థమవుతుందా" అంటుంది జ్యోత్స్న. "ఒకరు ఆఫర్ ఇస్తే తీసుకోను. నాకు ఆఫర్ నచ్చితే తీసుకుంటాను. ఆఫర్ చేసే మనిషి కూడా నచ్చాలి" అంటాడు సూరజ్. "గతంలో మన మధ్య ఉన్న గొడవను కూడా మర్చిపోదాం " అంటుంది జ్యోత్స్న. "అయితే ఒక పనిచేద్దాం. ఐ లవ్ యూ" అంటాడు సూరజ్. "రేయ్ నాకు తెలుసురా. నేను మళ్లీ అన్నాను అనుకో. నేను ఐ లవ్ యూ అనలేదు. థాంక్యూ చెప్పాను అంటావు " అంటుంది జ్యోత్స్న. "అనకపోతే.. నేను ఏదీ రెండోసారి చెప్పను. " అంటాడు సూరజ్. "అనకపోతే పోరా.. ఆ వంటలక్క వంటలు ఏం చేయాలో తెలియక ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పోయి ఓదార్చు. అంతకంటే మీరిద్దరు ఏం చేయలేరు" అంటుంది జ్యోత్స్న కోపంగా. "థాంక్యూ.. కాఫీ చాలా బాగుంది" అంటూ వెళ్లిపోతాడు సూరజ్.