Mutual Funds : రిస్క్‌తో కూడుకున్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా సంపద లాంగ్ రన్‌లో భారీగా పెరుగుతుంది. ఇక్కడ వడ్డీపై వడ్డీ పెరుగుతుంది కాబట్టి సంపద కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. చాలా వరకు ఈక్విటీ సగటున వార్షిక ప్రాతపదికన 12 శాతం వరకు రిటర్న్స్ ఇస్తుంటాయి. అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చేవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం గత పదేళ్ల కాలంల ో అద్భుత రిటర్న్స్ ఇచ్చిన స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో సెక్టోరియల్, థిమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఈ పదేళ్లలో మొత్తం 224 ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌కు చెందిన వార్షికంగా సగటున 20.94 శాతం CAGR రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ 2010 సెప్టెంబర్ 16న లాంఛ్ అయింది. వాల్యూ రీసెర్చ్, మార్నింగ్‌స్టార్ నుంచి ఇది 5 స్టార్ రేటింగ్ పొందింది. దీర్ఘకాలంలో ఇది బెంచ్‌మార్క్‌ ఇండెక్స్ రిటర్న్స్‌ను మించింది. గత 3 నెలల కాలంలో చూస్తే ఈ స్కీమ్ 16.15 శాతం రాబడి అందించింది. 6 నెలల్లో 8.45 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఐదేళ్లు, పదేళ్లలో చూస్తే వరుసగా 20.38 శాతం, 20.94 శాతం చొప్పున రాబడి అందుకున్నారు. స్కీమ్ లాంఛింగ్ నుంచి అంటే 16 ఏళ్ల వ్యవధిలో 20.03 శాతం రిటర్న్స్ వచ్చాయి. గత 10 క్యాలెండర్ ఇయర్స్‌లో చూస్తే 2018, 2019 ల్లో వరుసగా 16.69 శాతం, 2.52 శాతం నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 2021లో అత్యధికంగా 74.34 శాతం రాబడి వచ్చింది. రిటర్న్స్ పరంగా చూస్తే స్కీమ్ లాంఛింగ్ సమయంలో నెలకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే 22.26 శాతం XIRR రాబడికి రూ. 1.36 కోట్లు వచ్చాయి. పదేళ్లలో చూస్తే రూ. 10 వేల సిప్‌పై రూ. 36.79 లక్షలు వచ్చాయి. ఐదేళ్లలో 10 వేల సిప్‌పై రూ. 9.13 లక్షలు వచ్చాయి. అదే లంప్ సమ్ పెట్టుబడుల విషయానికి వస్తే రూ. 1 లక్ష ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే 16 ఏళ్లలో రూ. 17.78 లక్షలు వచ్చాయి. పదేళ్లలో చూస్తే రూ. 6.69 లక్షలు వచ్చాయి. ఐదేళ్ల వ్యవధిలో రూ. 2.55 లక్షలు వచ్చాయి. ఈ స్కీమ్ నిర్వహణలోని ఆస్తుల విలువ AUM రూ. 74,604 కోట్లుగా ఉంది. నిర్వహణలోని ఆస్తుల పరంగా చూస్తే ఇదే అతిపెద్ద స్మాల్ క్యాప్ ఫండ్.