: భారతదేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఇలా అన్నింటికీ ఆర్బీఐ నియంత్రణ సంస్థగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంటే ఇవి ఇక్కడ ఆర్బీఐ మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. నిబంధనల్ని ఉల్లంఘిస్తే.. కస్టమర్ల సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంటుంది. చాలా వరకు కో ఆపరేటివ్ బ్యాంకులు, NBFC లు, ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపై చర్యలు ఎక్కువగా తీసుకుంటుంది. ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చాలా సార్లు జరిమానాలతో సరిపెట్టినా.. కొన్ని సార్లు సమస్య తీవ్రంగా ఉంటే చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలాగే కేంద్ర బ్యాంక్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని గోకాక్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి . ఈ మేరకు జూన్ 18న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. బ్యాంక్ వద్ద తగినంత మూలధన నిల్వలు లేకపోవడం, ఆర్థిక పరిస్థితి అంతకంతకూ క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. డిపాజిటర్ల ప్రయోజనాల దృష్య్టా.. బ్యాంకును మూసివేయక తప్పదని తెలిపింది. భవిష్యత్తుల్లో ఆదాయం వస్తుందన్న అంచనాలు కూడా లేవని స్పష్టం చేసింది. జూన్ 18నే బ్యాంక్ క్లోజ్..ఆర్బీఐ నిర్ణయంతో ఈ బ్యాంకు ఇకపై ఎలాంటి కొత్త డిపాజిట్లు స్వీకరించడం లేదా పాత వాటిని తిరిగి చెల్లించడం చేయరాదు. అంటే వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా జూన్ 18 నుంచే మూసివేయాలని కేంద్ర బ్యాంక్ ఆదేశించింది. బ్యాంకును మూసివేసి దివాలా ప్రాసెస్ నిర్వహించేందుకు లిక్విడేటర్‌ను నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కర్ణాటక సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. బ్యాంక్ డిపాజిటర్ల డబ్బులు చెల్లించలేని స్థితిలో దివాలా తీసిన నేపథ్యంలో ఇక్కడ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద డిపాజిట్లపై బీమా ఉంటుంది. గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని ద్వారా సుమారు 97.9 శాతం మంది డిపాజిటర్లకు పూర్తి డిపాజిట్ మొత్తం అందుతుందని ఆర్బీఐ తెలిపింది. అర్హత కలిగిన ప్రతి డిపాజిటర్ దీని కింద గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు తమ డబ్బులు పొందేందుకు అర్హులు. మరికొన్ని బ్యాంకులకు జరిమానా..ఇదిలా ఉంటే మరికొన్ని కోఆపరేటివ్ బ్యాంకులపై పెనాల్టీ విధించింది. తమ నిబంధనల్ని పాటించని కారణంతో జరిమానా చర్యలతో సరిపెట్టింది. మరోసారి ఇదే రిపీట్ అయితే ఆంక్షలు విధించడం, లైసెన్స్ రద్దు చేయడం చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. నాసిక్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నాసిక్ రోడ్ దేవ్‌లాలీ వ్యాపారి సహకారి బ్యాంకుకు రూ. 2.10 లక్షల పెనాల్టీ విధించింది. కర్ణాటక చిత్రదుర్గ కేంద్రంగా పనిచేస్తున్న చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 1.50 లక్షల ఫైన్ వేసింది. మహారాష్ట్ర హింగన్‌ఘాట్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వార్ధా డిస్ట్రిక్ట్ ఆశీర్వాద్ మహిళా నగరి సహకారి బ్యాంకు, గుజరాత్ మెహ్సానాలోని సర్వోదయా కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ. 20 వేల చొప్పున, మహారాష్ట్ర నందుర్బర్‌కు చెందిన నవాపూర్ మర్చంటైల్ కో ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 10 వేల జరిమానా విధించింది.