జగన్ ఇంటికి 200 మీటర్ల దూరం నుంచి అడుగుతున్నా.. దమ్ముంటే రండి.. నారా లోకేష్ సవాల్

Wait 5 sec.

అధికార జరుగుతోంది. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ చేసిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఎంపికపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే పలువురు డీఎస్సీ అభ్యర్థులు జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ పరిణామాల మధ్య ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరం నుంచి అడుగుతున్నానని.. దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీ నేతల్లా తాము బురద జల్లి పారిపోమన్న లోకేష్.. డీఎస్సీ గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. "జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని గతంలో చెప్పా. అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం. సబర్వాల్ జడ్జిమెంట్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేను ముందుగా అధ్యయనం చేశా. పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా 150 రోజుల్లోనే 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ టెట్ నిర్వహిస్తున్నాం. మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. దానిలో ఎలాంటి సందేహం లేదు. పదివేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తు్న్నాం. దయచేసి నిరుద్యోగ యువతీ యువకులకు చెప్తున్నా. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈ రిజర్వేషన్ అమలు చేయకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అడ్డుపెట్టుకుని వైసీపీ వాళ్లే కోర్టులో కేసులు వేసి స్టే తీసుకువస్తారు". "వైసీపీ వాళ్లే 240 కేసులు వేశారు. 43 కేసులను కోర్టు డిస్మిస్ చేసింది. ఐదేళ్లలో వైఎస్ జగన్ ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు, గ్రూప్ -1, గ్రూప్ -2 లేదు. ఒక్క డీఎస్సీ భర్తీ చేసి ఉన్నా వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్‌కు తెలిసేది. ఒక్క డీఎస్సీ వేయకుండా, ఒక్క టీచర్ పోస్టు ఇవ్వకుండా మాపై మాట్లాడే అర్హత ఉందా.. ఒక్క అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరం నుంచి అడుగుతున్నా. దమ్ముంటే డీఎస్సీ గురించి చర్చకు రావాలి".. అంటూ సవాల్ విసిరారు.