: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. 2026, జూన్ 20న లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ప్రధాని మోదీ.. వెస్ట్ బెంగాల్ హుగ్లీలోని తారకేశ్వర్ వేదికగా పీఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ సహా అగ్రికల్చర్ ఇండియా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఆఫీస్ కూడా ట్విట్టర్‌లో దీని గురించి ప్రకటన చేశాయి. చివరిసారిగా 22వ విడత డబ్బులు అసోం గువాహటి కేంద్రంగా మార్చి 13న ప్రధాని మోదీ విడుదల చేశారు. అప్పుడు దేశవ్యాప్తంగా 9,46,15,309 మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. ఇది డిసెంబర్- మార్చి త్రైమాసికానికి కాగా తర్వాత ఇప్పుడు ఏప్రిల్- జులై 4 నెలల కాలానికి డబ్బులు రానున్నాయి. కేంద్రం ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఇచ్చే రూ. 6 వేలను ఒకేసారి అకౌంట్లో జమ చేయదు. దీనిని 3 విడతల కింద రూ. 2 వేల చొప్పున ప్రతి 4 నెలలకు ఓసారి అందిస్తుంది. దీనిని డిసెంబర్- మార్చి, ఏప్రిల్- జులై, ఆగస్ట్- నవంబర్‌గా విభజించింది. లబ్ధిదారుల సంఖ్య మాత్రం విడత పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ అనర్హుల్ని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక పీఎం కిసాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన నేపథ్యంలో రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ డబ్బులు పొందాలంటే పీఎం కిసాన్ పోర్టల్‌తో ల్యాండ్ డీటెయిల్స్ అనుసంధానమై ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డుతో సీడింగ్ అయి ఉండాలి. మరో ముఖ్యమైన విషయం కేవైసీ పూర్తి చేయడం. పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇకేవైసీ అనేది తప్పనిసరి. ఇది చేయకుంటే డబ్బులు ఆగిపోవచ్చు. కేవైసీ ఎలా చేయాలి?పీఎం కిసాన్ కింద కేవైసీని 3 విధాలుగా చేయొచ్చు. . దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ పూర్తి చేయొచ్చు. ఇంకా పీఎం కిసాన్ అఫీషియల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. లిస్టులో మీ పేరుందా లేదా?పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో బెనిఫిషియరీ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. . అక్కడ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి. అక్కడ లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. మీ స్టేటస్ తెలుసుకునేందుకు అక్కడే ఫార్మర్స్ కార్నర్‌లో నో యువర్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే కూడా అక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబరుపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా అదే ఫార్మర్స్ కార్నర్‌లో మొబైల్ నంబర్ అప్డేట్, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అప్డేషన్, పీఎం కిసాన్ బెనిఫిట్స్ వాలెంటరీ సరెండర్ వంటివి చేసుకోవచ్చు.