: ఎలాన్ మస్క్.. ఈ పేరును ప్రపంచం అంత ఈజీగా మర్చిపోదు. లార్జర్ దన్ లైఫ్ అన్నది ఈయనకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచమే కుళ్లుకునేలా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. అది కూడా రూ. 10- 20 లక్షల కోట్ల సంపదతో కాదు.. కొద్ది రోజుల కిందట ఆయన సంపద రూ. 100 లక్షల కోట్లు దాటింది. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఇటీవల ఆయనకు చెందిన స్పేస్‌‌ఎక్స్ కంపెనీ లిస్టింగ్ కావడంతో ఊహించని రీతిలో ఆయన సంపద పెరిగింది. దీంట్లో మస్క్‌కు వందల కోట్ల షేర్లు ఉండటంతో ఆయన సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసింది. లిస్టింగ్ తర్వాత కూడా స్పేస్ ఎక్స్ షేర్లు ఇంకా దూసుకెళ్తుండటంతో సంపద అంతకంతకూ పెరుగుతూ పోతూనే ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం సంపద ప్రస్తుతం 1.32 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది ఏకంగా రూ. 125 లక్షల కోట్ల వరకు ఉంటుంది. మస్క్ దరిదాపుల్లోనూ ఎవరూ లేరు. రెండో స్థానంలో ల్యారీ పేజ్ 317 బిలియన్ డాలర్లతో ఉండగా ఇది భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 30 లక్షల కోట్ల వరకు ఉంటుంది. మార్కెట్ విలువ పరంగా ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో దిగ్గజ ఇ- కామర్స్ సంస్థ అమెజాన్‌ను కూడా దాటేసింది. మరికొద్దిరోజుల్లో మరిన్ని సంచలనాలు కూడా సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు. భవిష్యత్తును ఊహించడమే కాదు.. దానికి గట్టి పట్టుదల కూడా తోడైతే ఆయనే మస్క్. కొత్త కొత్త ఆలోచనలతో స్పేస్ఎక్స్, టెస్లా, స్టార్ లింక్ ఇలా పెద్ద పెద్ద కంపెనీల్ని స్థాపించి రాణిస్తూ తనదైన ముద్ర వేశారు. అయితే మస్క్ ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించారని ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త, అన్నారు. మస్క్ విజయం వెనుక అచంచల విశ్వాసం దాగి ఉందని, ఆయన అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగల వ్యక్తి అని ఒక ఇంటర్వ్యూలో మహీంద్రా కొనియాడారు. '2018లో ఎలాన్ మస్క్‌ను ఒకసారి కలిశాను. ఆ సమయంలో ఆయన చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా వెనుకడుగు వేయలేదు. ఆనందభరిత క్షణాల కంటే కఠిన పరిస్థితులనే ఆవిష్కర్తలు ముందుగా అంచనా వేస్తారు. ఈ క్రమంలోనే మస్క్ క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించారు. ఈ రోజు ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకున్న వ్యక్తిగా మస్క్‌ను హెడ్‌లైన్స్‌లో మనం చూస్తున్నాం. నేడు అసాధ్యమనుకున్న దానిని కూడా సుసాధ్యం చేయొచ్చనే గట్టి నమ్మకం ఉన్న వ్యక్తి. ఆయన దృఢ సంకల్పంతో సవాళ్లను అధిగమించిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది.' అని మహీంద్రా వివరించారు. తాజాగా ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని ట్యాగ్ చేస్తూ 2018లో తాను ఏం ట్వీట్ చేశారో చెప్పుకొచ్చారు.