గాదె సాయికృష్ణ కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్.. కీలక వ్యాఖ్యలు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సాయికృష్ణ కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడం.. ఆ మరుసటి రోజేతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో సీఐ నాగరాజుపై ఆరోపణలు రావటంతో ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే సమయంలో సాయికృష్ణ కాపు సామాజికవర్గానికి చెందిన యువకుడని.. స్పందించటం లేదంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై స్పందించారు. చేశారు. "ఒక తల్లి తన కొడుకు కనిపించడం లేదని.. కోర్టులను ఆశ్రయించడం ఆమె ప్రాథమిక హక్కు. బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, కనిపించడం లేదు.. ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. రాజ్యాంగం, చట్టం నేరస్థుల కులం, మతం చూడదు. ఏం జరిగింది.. ఎవరికి ఎవరు ఏం చేశారనేదే చూస్తాయి. అంతకుమించి కులం గురించి ప్రస్తావన ఉండదు. యువతకు నేను చెప్పేది ఒక్కటే.. మీరు కులం కోణంలో నేరస్థులను చూడొద్దు. నేతలు అందరికీ చెప్తున్నా.. నేరస్థులకు కులం ఉండదు. తప్పుచేసే వారికి, మానభంగాలు చేసే వారికి కులమనేది అంటగట్టవద్దు. అలాంటి నీచులను మనం వెనకేసుకుని వస్తే.. అది ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని తెలియజేస్తుంది." అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలుమరోవైపు నేరస్థులకు కొమ్ముకాసే నాయకులను ప్రజలు దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నేరస్థులను ఆదరిస్తే..భవిష్యత్తును మంటగలిపేస్తారని పవన్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే సుగాలి ప్రీతి కేసును ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని జనసేన పార్టీ ఆందోళనలు చేసిందని.. దీంతో అప్పటి వైసీపీ సర్కారు తూతూమంత్రంగా కేంద్రానికి లేఖ రాసిందన్నారు పవన్. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుపై విచారణ చేద్దామంటే.. వైసీపీ హయాంలోనే సాక్ష్యాలను ధ్వంసం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.