అందుబాటులో లేకుండా పోయిన వైసీపీ ఫేస్ బుక్ పేజీ..

Wait 5 sec.

Unavailable in indiaఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతులను నొక్కేందుకు ప్రయత్నిస్తోందని అధినేత, మాజీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వైసీపీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ తొలగించారని.. ఇప్పుడు వైసీపీ ఫేస్ బుక్ పేజీని మన దేశంలో అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఎక్స్ వేదికగా పంచుకున్నారు వైఎస్ జగన్. ఇది కేవలం వైసీపీపై దాడి మాత్రమే కాదని.. ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేఛ్పై జరిగిన దాడిగా వైఎస్ జగన్ అభివర్ణించారు. తాము వాస్తవాలను మాత్రమే వెల్లడిస్తామని.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి బయటపెడతామని జగన్ స్పష్టం చేశారు. అలాగే ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లను నిలిపేయడం, నిజాలు మాట్లాడే ప్రతిపక్షాల గొంతులను అణచివేసేయ ప్రమాదకర పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తోందన్న వైఎస్ జగన్.. దీనిని అత్యంత అప్రజాస్వామిక చర్యగా ఆరోపించారు. అమరావతి రాజధాని సంబంధించిన అనవసర ఖర్చులను, డీఎస్సీలో అవకతవకలను, అవినీతిని, టీటీడీ నెయ్యి టెండర్ల వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని.. ఆన్‌లైన్‌లో విమర్శనాత్మక కంటెంట్ మీద ఆంక్షలు విధిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇది చాలా ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఈ అన్యాయమైన చర్యలపై చట్టపరంగా పోరాటం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాజ్యాంగపరమైన మార్గం ద్వారా దీనిని సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. బెదిరింపులు, సెన్సార్ షిప్, సంస్థల దుర్వినియోగంతో ప్రజా గొంతుకలను అణచివేయలేరని వైఎస్ జగన్ హెచ్చరించారు. అధికారంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలన్న జగన్.. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీని తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.