తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరుగుతూ.. గతంలో తీవ్ర అలజడి సృష్టించిన అలియాస్ అల్లూరి శ్రీనివాస్ గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే యువతులను మోసం చేసినట్లు పలువురు ఆరోపించగా.. అతడిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అతడిని జైలుకు కూడా పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బయటికి వచ్చిన .. కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించలేదు. దీంతో అంతా అతడిని మరిచిపోతున్న క్రమంలో ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ వెలుగులోకి రావడంతో అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి మరో అమ్మాయితో అఘోరీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.తాజాగా ఓ యువతితో కలిసి లేడీ అఘోరీ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో కిడ్నాప్, మోసం ఆరోపణలు ఎదుర్కొన్న అఘోరీ శ్రీనివాస్.. ఇప్పుడు మళ్లీ బయటికి వచ్చి చర్చనీయాంశంగా మారాడు. తాజాగా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి షేర్ చేస్తూ.. ‘శీనుగా.. నీకు పెండ్లిగాని మగపోరల ఉసురు తలుగుడు పక్కారా’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇక వైరల్ అవుతున్న ఆ వీడియోలో అఘోరీ శ్రీనివాస్ చేతిలో పెంపుడు కుక్కను పట్టుకుని నడుస్తుండగా.. అతడి పక్కనే మరో యువతి అతనితో సన్నిహితంగా, సరదాగా మాట్లాడుతూ భుజాలపై చేతులు వేస్తూ.. మాట్లాడుతూ కనిపిస్తోంది. అయితే అది ఎక్కడ అనేది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే వారి పక్కనే ఒక కారు కనిపిస్తుండగా.. దానికి రాజస్థాన్ నెంబర్ ప్లేట్ ఉండటం ఆ వీడియోలో కన్పిస్తోంది. దీంతో వారు రాజస్థాన్‌లో ఉన్నారా లేక రాజస్థాన్ నంబర్ ప్లేట్ కారు మాత్రమే ఇంకా ఎక్కడైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ప్రాంతానికి చెందిన వర్షిణి అనే బీటెక్ విద్యార్థినితో అఘోరీ శ్రీనివాస్ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఆమెకు అతడు మత్తుమందు ఇచ్చి, తన వశపరుచుకుని కిడ్నాప్ చేసినట్లు అతడిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న ఆలయంలో వర్షిణిని అఘోరీ శ్రీనివాస్ ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన తలంబ్రాల వీడియోలు అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే తమ కూతురు, కొడుకును లేడీ అఘోరీ శ్రీనివాస్ తమ ఇంట్లోనే లైంగికంగా వేధించాడంటూ వర్షిణి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అఘోరీ శ్రీనివాస్ ఒక మోసగాడు అని తీవ్ర ఆరోపణలు చేసిన వర్షిణి.. అతడి నుంచి విడిపోయింది.ఇక రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలానికి చెందిన ఒక మహిళా ప్రొడ్యూసర్‌ను కూడా పూజల పేరుతో అఘోరీ శ్రీనివాస్ దారుణంగా మోసం చేసినట్లు ఆమె ఆరోపించింది. ఆమెకు ఉన్న సమస్యలను తీరుస్తానని.. ‘యోని పూజ’ పేరుతో ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.10 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు చేశారు. వీటికి అదనంగా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే మంత్రాలు, చేతబడులతో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని.. బాధితురాలి ఫిర్యాదుతో మోకిలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పరారీలో ఉన్న అఘోరీ శ్రీనివాస్‌ను ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.ఇక అఘోరీ శ్రీనివాస్‌ అరెస్ట్ అయిన తర్వాత అతడి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చారు. కరీంనగర్‌కు చెందిన ఇంకో మహిళ మీడియా ముందుకు వచ్చి.. తనను గతంలో కూడా బలవంతంగా తాళి కట్టి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్ని క్రిమినల్ కేసులు.. నేర చరిత్ర ఉన్నప్పటికీ.. తాజాగా అఘోరీ శ్రీనివాస్ ఇంకో కొత్త అమ్మాయితో ఉన్న వీడియో వైరల్ కావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.