మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత కెప్టెన్ చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మిథాలీ రీజ్ రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచులో హర్మన్ ప్రీత్ కౌర్.. 35 బంతుల్లో 36 పరుగులు స్కోరు చేసింది.కాగా మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు వరకు హర్మన్ ప్రీత్ కౌర్.. ఈ టోర్నీ హిస్టరీలో సరిగ్గా 726 పరుగులు చేసింది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ సైతం ఇన్నే రన్స్ చేసింది. తాజాగా పాకిస్థాన్‌తో మ్యాచులో తొలి పరుగు చేయడం ద్వారా హర్మన్.. మిథాలీని అధిగమించింది. మిథాలీ రాజ్ 23 ఇన్నింగ్స్‌లలోనే 726 పరుగులు స్కోరు చేయడం గమనార్హం. అయితే హర్మన్ ప్రీత్ మాత్రం కాస్త ఎక్కువ ఇన్నింగ్స్‌లే తీసుకుంది. 34 ఇన్నింగ్స్‌లలో హర్మన్ ఈ ఫీట్ సాధించింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్మృతి మంధాన (44 బంతుల్లో 68 రన్స్), హర్మన్ ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36 రన్స్), రిచా ఘోష్ (17 బంతుల్లో 34 రన్స్) రాణించారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది.మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అత్యధిక స్కోర్లు..194/5 vs న్యూజిలాండ్, ప్రొవిడెన్స్, 2018172/3 vs శ్రీలంక, దుబాయ్, 2024170/6 vs పాకిస్థాన్, బర్మింగ్‌హామ్, 2026*167/8 vs ఆస్ట్రేలియా, ప్రొవిడెన్స్, 2018167/8 vs ఆస్ట్రేలియా, కేప్‌టౌన్, 2023