KKRతో మ్యాచ్‌లో రొమారియో షెఫర్డ్‌కి షాక్.. ఆర్సీబీ ప్లేయింగ్ 11 నుంచి ఔట్, వెంకటేశ్ అయ్యర్‌కి ఛాన్స్!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైంది. రాత్రి 7 గంటలకు పడాల్సిన టాస్.. 8:30 గంటలకు వేశారు. వర్షం పడినప్పటికీ ఓవర్లలో ఎలాంటి మార్పు లేదు. 20 ఓవర్ల మ్యాచే అంపైర్లు నిర్ణయించారు. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌‌కు రానుంది. ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత కొంతకాలంగా విఫలమవుతూ వస్తున్న రొమారియో షెఫర్డ్‌ను ప్లేయింగ్ 11 నుంచి తొలగించిన ఆర్సీబీ, సుయాశ్ శర్మను బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ ఇద్దరి స్థానాల్లో వెంకటేశ్ అయ్యర్, జేకబ్ డప్ఫీలను జట్టులోకి తీసుకుంది. వెంకటేశ్ అయ్యర్ ప్లేయింగ్ 11లోకి రావడం ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ 11 మ్యాచ్‌లలో 7 గెలిచి 14 పాయింట్లతో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోవచ్చు. కేకేఆర్ 10 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 9 పాయింట్లతో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే కేకేఆర్ మిగతా నాలుగు మ్యాచ్‌లలో గెలవాల్సిందే. ఇక ఐపీఎల్‌లో హెడ్ టు హెడ్ రికార్డులలో ఆర్సీబీపై కేకేఆర్‌దే పైచేయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుజేకబ్ బెతెల్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేశ్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ దార్, జేకబ్ డప్ఫీ, జోష్ హేజిల్‌వుడ్.