రేపు రాష్ట్రంలో మాడు పగిలేలా ఎండలు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Wait 5 sec.

మండిపోనున్నాయి. గరిష్ఠంగా 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జికే వీధి మండలం, పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, గుర్తేడు మండలాల్లో గురువారం రోజున వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక శుక్రవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఒక మండలంలో తీవ్రవడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక అల్పపీడనానికి తోడు ఉత్తర తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా , బాపట్ల, నెల్లూరు, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉంది. మండే ఎండలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలుమరోవైపు బుధవారం రోజున చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 143 మండలాల్లో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకావటం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండల నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ఎండల కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తలకు క్యాప్ పెట్టుకోవాలని.. లేదా గొడుగు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని.. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్తున్నారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు వీలైనంత వరకూ ఇంటి పట్టునే ఉండటం మంచదని అధికారులు సూచిస్తున్నారు.