ప్రతీ గొట్టంగాడు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వాల్సిన పనిలేదు.. కానీ..? మహాసేన రాజేష్ వ్యాఖ్యలకు రఘురామ కౌంటర్

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వివిధ అంశాలపై ప్రశ్నిస్తూ టీడీపీ నేత, పోస్టు పెట్టడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే ఆ తర్వాత ఆయన ఆ పోస్టును తొలగించారు. అయితేస్పందించారు. మహాసేన రాజేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేసుకున్నారు. ప్రతీ గొట్టంగాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్న .. కానీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో వేధించినప్పటికీ.. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు వైఎస్‌ జగన్‌ను ఎందుకు విమర్శించటం లేదని మహాసేన రాజేష్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శలకు రఘురామ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన రుణాలు, దారుణాల గురించి మొదట ప్రశ్నించిందని తానేనని అన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అందరూ దీనిపై ప్రశ్నించడం ప్రారంభించారని గుర్తు చేశారు.వైఎస్ జగన్‌ను ఓడించేంతవరకూ రచ్చబండ రూపంలో ఆయన తప్పులను ఎత్తిచూపుతూనే వచ్చానని.. తన ఆశయం నెరవేరి జగన్ ఓడిపోయారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ దారుణంగా ఓడిపోయిన తర్వాత నేను ఆయన గురించి తాను మాట్లాడటానికి ఇంకేం ఉంటుందని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వైసీపీ ఓటమితో తన గోల్ రీచ్ అయ్యాయని.. అసెంబ్లీకి రాకపోతే రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే పదవి పోతుందని కూడా జగన్‌కు చెప్పినట్లు రఘురామ గుర్తుచేశారు. ఇక తన కేసు విషయంలో నత్తనడకన సాగుతున్న విచారణ గురించి తాను ప్రశ్నిస్తూనే ఉన్నానని.. కానీ విచారణలో అలసత్వం జరుగుతోందన్నారు రఘురామ. డిప్యూటీ స్పీకర్‌ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు అందరు ఎమ్మెల్యేలను గౌరవించాలని.. ఆ రకంగానే వైఎస్ జగన్‌ను గౌరవించానని.. ఈ పదవిలో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడటం సరైంది కాదన్నారు ఈ విషయంలో మహాసేన రాజేష్ చెప్పినట్లుగా జగన్‌ను తిట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు రఘురామకృష్ణరాజు.తనకు జగన్ బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని.. తోటి మహాసేన రాజేష్‌కు కౌంటరిచ్చారు.