RBI Governor Sanjay Malhotra: పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి.. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న () ఆందోళనలు పెరిగాయి. మొన్నటివరకు.. ఎన్నికలు ముగిశాక ధరల పెంపు తప్పదని పలు రిపోర్ట్స్ పేర్కొనగా.. కేంద్రం ఇప్పటివరకు పెంచలేదు. మరోవైపు.. భారత్‌లో 50 రోజులకుపైగా సరిపడా నిల్వలున్నాయని.. ధరల్ని పెంచే ఉద్దేశం లేదని చెబుతూ వచ్చింది. ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగం తగ్గించాలని.. వంటనూనెల వాడకం తగ్గించాలని.. బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు నిలిపివేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక్కడ . దీంతో ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు నెక్ట్స్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కూడా తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ తాజాగా దీని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇదే స్థాయిలో కొనసాగితే.. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్‌లో ఐఎంఎఫ్, స్విస్ నేషనల్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇలా మాట్లాడారు. RBI Governor on Petrol Diesel Prices:అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాకు అంతరాయాలు కొనసాగితే.. ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందని చెప్పారు కేంద్ర బ్యాంక్ గవర్నర్. 'పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇలా దీర్ఘకాలం కొనసాగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనేది జస్ట్ ఏ మ్యాటర్ టైమ్.' అని మల్హోత్రా అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించిందని.. మరోవైపు చమురు కంపెనీలు నష్టాల్ని భరిస్తూ ధరల్ని నియంత్రిస్తున్నాయని తెలిపారు.ఇలా ధరల్ని పెంచకుండా ఉండటం ఎంత కాలం అనేది ప్రశ్నార్థకంగా మారిందని సంజయ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. చమురు ధరలు ఇలానే పెరిగితే.. భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది కాబట్టి.. దిగుమతుల బిల్లు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై.. ముఖ్యంగా వస్తువుల రవాణా ఖర్చులపై ప్రభావం చూపి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని చెప్పారు.Modi Appeal to Nation:భారత్ వినియోగించే చమురులో సుమారు 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. దీని కొనుగోలుకు డాలర్లు వెచ్చించాలి కాబట్టి ఇది విదేశీ మారక ద్రవ్యం విదేశాలకు తరలిపోయేలా చేస్తుంది. దీంతో డాలర్ల సప్లై పెరిగి.. రూపాయి విలువ తగ్గుతుంది. ఈ క్రమంలోనే విదేశీ మారకాన్ని ఆదా చేయడం కోసం.. దేశంలో చమురు వినియోగం తగ్గించాలని మోదీ పిలుపునిచ్చారు. వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మళ్లాలని.. కార్ పూలింగ్‌ అలవాటు చేసుకోవాలని.. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. ఈ క్రమంలోనే దీనిని ఆచరణలో పెట్టేందుకు.. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలించొచ్చని తెలుస్తోంది.