బండి భగీరథ్ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్.. బాధితురాలు మైనర్ కాదా? రెండు బర్త్ సర్టిఫికెట్లు

Wait 5 sec.

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఇప్పటికే బాలిక తల్లి బండి భగీరథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మొదట పట్టించుకోలేదని.. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్ సభలో తల్లికుమార్తెలం ఆత్మహత్య చేసుకుంటామని తేల్చి చెప్పడం, సోషల్ మీడియాలో బండి భగీరథ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆడియోలు వైరల్ కావడం.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో.. బండి భగీరథ్‌పై పోక్సో కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. .అయితే తాజాగా ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. బండి భగీరథ్‌ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న బాలిక వయసుపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అసలు బాధితురాలు వయసు కీలకంగా మారింది. ఆ బాలికకు 2 వేర్వేరు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్లు ప్రచారం జరగడం ఈ కేసులో బిగ్ ట్విస్ట్‌గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్‌లో ఆ బాలిక పుట్టిన తేదీ 2008 ఆగస్ట్ 12వ తేదీ అని ఉంది. అదే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ 2010 ఆగస్ట్ 12వ తేదీ అని ఉండటం ఇప్పుడు ఈ కేసులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితురాలికి బర్త్ సర్టిఫికెట్లు రెండు వేర్వేరుగా ఉండటంతో ఇప్పుడు ఈ కేసులో గందరగోళం నెలకొంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులు కూడా బాధితురాలికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లపై ఫోకస్ పెట్టారు. ఆ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా స్కూల్ సర్టిఫికెట్లలో ఆ బాధితురాలు నమోదు చేసిన పలు పుట్టిన తేదీ వివరాలను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో వేర్వేరు పేర్లు, వేర్వేరు పుట్టిన తేదీలు ఉండటంతో ఈ కేసు విచారణ అధికారులకు కొత్త తలనొప్పిగా మారింది. ఇక 2021లో ఆ బాలికపై నమోదైన మైనర్ డ్రైవింగ్‌ కేసు ఛార్జిషీట్‌లో ఆమె వయస్సు 15 ఏళ్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బాధితురాలి కుటుంబానికి రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న వేళ.. వారికి రేషన్ కార్డు మాత్రమే ఉందని సమాచారం. ఈ పోక్సో కేసులో రోజుకో రకమైన విషయాలు, ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుండటంతో.. కేసును తేల్చేందుకు సిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.