కేంద్రం డబుల్ షాక్.. గోల్డ్ మార్కెట్ క్రాష్.. 3 రోజుల్లోనే ఇన్వెస్టర్లకు రూ. 60 వేల కోట్లు లాస్..!

Wait 5 sec.

: భారతదేశంలోని ప్రముఖ జువెల్లరీ స్టాక్స్ గత 3 రోజులుగా కుదేలవుతున్నాయి. వీటిల్లో ప్రముఖంగా టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ, కల్యాణ్ జువెల్లర్స్ లిమిటెడ్, సెంకో గోల్డ్, తంగమాయిల్ జువెల్లరీ వంటివి ఉన్నాయి. వీటిల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో ఆయా కంపెనీల మార్కెట్ విలువ భారీగా తగ్గుతుండటంతో పాటు ఇదే సమయంలో మదుపరుల సంపద కూడా ఆవిరైపోతోంది. కేవలం 3 ట్రేడింగ్ సెషన్లలో చూస్తే ఈ స్టాక్స్ ఏకంగా 20 శాతం వరకు పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో వీటన్నింటి మార్కెట్ విలువ రూ. 60 వేల కోట్ల వరకు తగ్గగా.. ఇదే స్థాయిలో మదుపరుల సంపద తగ్గిపోయింది. ఇక్కడ ఈ స్టాక్స్ పతనం అయ్యేందుకు ప్రధాన కారణం.. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలే. అవును .. తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ప్రకటన.. డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. భారత్‌లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు దిగుమతి బిల్లు తగ్గించుకోవడంలో భాగంగా.. బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ఏడాది పాటు కొనుగోళ్లు నిలిపివేయాలని భారత ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభలో పలు కీలక ప్రకటనల్లో ఇదొకటి. దీంతో పాటు చమురు వినియోగం తగ్గించుకోవాలని.. ఇందుకోసం మెట్రోల్లో ప్రయాణించాలని.. వ్యక్తిగత వాహన వినియోగం తగ్గించుకోవాలని కూడా చెప్పారు. ఇక్కడ బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని చెప్పిన ప్రకటనతోనే తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా జువెల్లరీ కంపెనీల కార్పొరేట్ ఆదాయాలపై ప్రభావం పడుతుందన్న భయాలతో.. . మరోవైపు.. మోదీ ప్రకటన వచ్చిన 2 రోజులకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాల్ని ఏకంగా 6 శాతం నుంచి ఒకేసారి 15 శాతానికి పెంచింది. దీంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇది కూడా కొనుగోళ్లను దెబ్బతీస్తుందన్న భయంతో స్టాక్స్ పతనం అవుతూనే ఉన్నాయి. గత 3 సెషన్లలో కల్యాణ్ జువెల్లర్స్ షేర్ ధర 20 శాతం పతనమైంది. తంగమాయిల్ జువెల్లరీ, స్కై గోల్డ్ 3 రోజుల్లో 18 శాతం వరకు కుదేలయ్యాయి. సెంకో గోల్డ్ స్టాక్ 14 శాతం పతనమైంది. టైటాన్ షేరు 3 ట్రేడింగ్ సెషన్లలో 11 శాతం తగ్గింది. ఈ క్రమంలోనే ఈ పతనం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.