ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.. వారికి మాత్రమేనా ? సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Wait 5 sec.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాల్సిందే అంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం తప్పదని.. ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంగారం కొనుగోలు, ఇంధనం పొదుపు, వర్క్ ఫ్రం హోమ్ విధానం సహా కొన్ని సూచనలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ అంశం తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో వినిపించిన ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానం.. మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వినాల్సి వచ్చింది. ప్రధాని మోదీ సూచనల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వర్క్ ఫ్రం అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ వర్క్‌ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగంలోనూ అమలు చేస్తామన్నారు. త్వరలోనే ప్రపంచం మొత్తం ఇంట్లో కూర్చొని పనిచేసే పరిస్థితి రాబోతోందన్నారు. స్థానికంగా ఉన్న ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకునేలా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పరోక్షంగా ఇంధన సంక్షోభం నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. దీంతో ఏపీలో వర్క్ ఫ్రం హోమ్ అంశం తెరపైకి వచ్చింది.ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ను అమలు చేసే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. త్వరలోనే మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉందంటున్నారు. ఇంటి నుంచి పనిచేసేందుకు వీలున్న ఉద్యోగులు, కచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన వారిని విభజించే అవకాశం ఉందంటున్నారు. వీలున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్‌తో పాటుగా హైబ్రిడ్ విధానంలో ఒకరోజు ఇంట్లో, మరో రోజు ఆఫీసుకు వచ్చి పనిచేసే అంశాలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ పిలుపుతో చంద్రబాబు స్వయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. . మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వాహనాలను సగానికి తగ్గించాలని చంద్రబాబు సూచించారు.