తో ఆర్సీబీని గెలిపించాడు. వర్షం పడి పిచ్ సరిగ్గా లేకపోయినా.. రాయ్‌పూర్‌లో బౌన్స్‌లు వస్తున్నా.. మాత్రం తన ఆట తాను ఆడుతూ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ సెంచరీ చేశాడు. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు, సింగిల్స్‌తో ఆడుతూ పాడుతూ శతకం బాదేశాడు. క్రికెట్ అంటే తనకెంత పిచ్చో నిరూపించాడు. మ్యాచ్ అనంతరం సెంచరీ గురించి, ఇప్పటికీ క్రికెట్‌పై ఉన్న పిచ్చి గురించి కామెంటేటర్ ఇషాన్ బిషప్ అడగ్గా.. కింగ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. ఇంతకాలంగా తాను క్రికెట్‌లో కొనసాగడానికి బ్యాటింగ్‌పై ఉన్న క్రేజే కారణం. ఈ స్థాయిలో ఇప్పటికీ ఆడటం చాలా ఆనందంగా ఉందన్నాడు. "క్రీజులో నా పొజిషనింగ్ నాకు ఆనందాన్ని ఇచ్చింది. నా ఆటపైనే నమ్మకం ఉంచాను. చాలా ఫోర్లు కొట్టాను, గ్యాప్‌లను బాగా ఉపయోగించుకున్నాను. ఏ బంతులన్ని సిక్సర్లు కొట్టాలి, ఎక్కడికి హిట్ చేయాలి అనేది నాకు బాగా తెలుసు. జట్టుకు ఈ పరిస్థితుల్లో ఏం కావాలి అనేది, నా మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది" అని కోహ్లి అన్నాడు. రికార్డులు బద్దలుకొట్టడంపై కోహ్లి స్పందిస్తూ "నాకు బ్యాటింగ్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడటం నా అదృష్టం. క్రికెట్ అంటే నాకు ప్రాణం.. ఫీల్డింగ్, బ్యాటింగ్ ఏదైనా హార్ట్‌ఫుల్‌గా చేస్తాను. ఎందుకంటే ఒకరోజు ఈ ప్రయాణం ముగుస్తుంది. అందుకే మైదానంలో ఉండే ప్రతి క్షణాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాలి అనుకుంటాను. ఒత్తిడిని కూడా నేను ఎంజాయ్ చేస్తాను. కాస్త టెన్షన్ ఉన్న సందర్భాలను ఎదుర్కోవడం నాకు ఇష్టం.. అప్పుడే నన్ను నేను ఛాలెంజ్ చేసుకోగలను" అని అన్నాడు. క్రికెట్‌లో ఇన్నేళ్లుగా నా ప్రయాణం కొనసాగుతున్నా ఆటపై ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉందని కోహ్లి అన్నాడు. బ్యాట్‌ని బాల్‌తో హిట్ చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం ఇంకా తగ్గలేదని, అదంతా దేవుడి దయేనంటూ థాంక్స్ చెప్పాడు. కేకేఆర్‌పై చేసిన సెంచరీతో విరాట్ కోహ్లి తన కెరీర్‌లో తొమ్మిదో ఐపీఎల్ శతకాన్ని నమోదు చేశాడు.