తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్‌ జగన్‌ ఫోన్‌.. పాలనకు సంబంధించి, ఏం మాట్లాడారంటే

Wait 5 sec.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు టీవీకేతో పాటుగా (మీ) విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని.. దాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను, ఆకాంక్షల్ని నెరవేర్చాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగాలన్నారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా తెలిపారు. ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో అభినందించారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న. ఈ నెల 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు.. అలాగే తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలాన్ని నిరూపించారు.. ఆయనకు ఏకంగా 144మంది అనుకూల ఓట్లు వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ సమయంలో అన్నాడీఎంకేలోని పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు 22 మంది వ్యతిరేకించారు.. ఐదుగురు (నలుగురు పీఎంకే, ఒకరు బీజేపీ ఎమ్మెల్యే) తటస్థంగా ఓటు వేశారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచింది.. విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్‌ రాజీనామా చేశారు. తిరుపత్తూర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ సేతుపతి ఒక్క ఓటుతో గెలవడంతో ఈ వ్యవహారం ముందు హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో ఆయన ఓటు వేయలేకపోయారు. అలాగే స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ ఓటు వేయలేదు. దీంతో టీవీకేకు 3 ఓట్లు తగ్గాయి.. తమిళనాడు అసెంబ్లీలో బుధవారం నిర్వహించిన బలపరీక్షలో మొత్తం 171 మంది ఎమ్మెల్యేలు పాల్గొనగా.. డీఎంకే, డీఎండీకే ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు.