ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం చర్చనీయాంశమైంది.. అలాగే చర్చిల అంశం కూడా హైలైట్ అయ్యింది. ఈ రెండు అంశాలలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పేరు బలంగా వినిపిస్తోంది. ఆకివీడు రామాలయం పునర్ నిర్మాణంతో పాటుగా చర్చిల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ అంశాలపై టీడీపీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య సోషల్ మీడియా పోస్ట్‌ల అంశం హాట్‌టాపిక్ అయ్యింది. ఆకివీడు రామాలయం విషయంలోను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా మరో అంశాన్ని ప్రస్తావించారు. RRR (రఘురామ కృష్ణరాజు) గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ గత ప్రభుత్వ హయాంలో రఘురామను నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలోకే అడుగుపెట్టనివ్వలేదన్నారు. అంతే కాదు వైఎస్సార్‌సీపీవాళ్లు రఘురామను వేలాడదీసి కొట్టి చంపాలని చూశారు.. నీచంగా తిట్టారన్నారు. రఘురామ TDP MLAగా గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యారన్నారు. ఇప్పటివరకు RRR జగన్‌ను ఒక్కమాట అనలేదు ఎందుకని అంటూ ప్రశ్నించారు. పైగా అసెంబ్లీ లో జగన్‌ను పలకరించడానికి RRR ప్రయత్నించారని ఆరోపించారు. RRRని నీచంగా తిట్టిన విజయ్ సాయిరెడ్డితో ఇష్టంగా మాట్లాడుతున్నారన్నారు.రఘురామ ఉండి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వైసీపీ వాళ్లను ఇప్పటి వరకు ఒక్కమాట అన్నట్టు తాను చూడలేదన్నారు రాజేష్. కానీ 'నాకు సీట్ ఇవ్వలేని చంద్రబాబు పోలవరం కడతాను అంటే ఎలా నమ్మాలి' ఎన్నికలకు ముందు చంద్రబాబును రఘురామ పబ్లిక్‌గా విమర్శించారన్నారు. అలాగే భీమవరంలో ఒక DSP విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా రఘురామ పబ్లిక్‌గా స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. కూటమి MLA గా RRR ఇప్పుడు ఒక కులాన్ని, మతాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అన్నారు. ఆకివీడు రామాలయం విషయంలో అందరం RRRకు సపోర్ట్ చేశామని.. నిర్మాణం మొదలయ్యింది.. ఆకివీడులో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అయినా కానీ ఆ తరువాత కూడా అనవసరంగా కుల మతాలను టార్గెట్ చేసి హేళనగా మాట్లాడటం ఎలా అర్ధం చేసుకోవాలి? అంటూ ప్రశ్నించారు. 'Pv సునీల్ కుమార్,జాడ శ్రవణ్ కుమార్ అనుకున్నంత మాత్రాన ఆకివీడులో రామాలయం ఆపలేరు. RRR అనుకున్నంత మాత్రాన ఉండి నియోజకవర్గంలో చర్చిలను ఆపలేరు. సునీల్, శ్రవణ్ కుమార్లు ఇద్దరూ అన్ని కోర్టులకి తిరుగుతున్నారు కానీ రామాలయ శంకుస్థాపన ఆగిందా? నిర్మాణం ఆగిందా?. అలాగే రఘురామ 113 చర్చిల పర్మిషన్ కోసం నోటీసులు పంపించాడు.. ఏ చర్చి కైనా ఇబ్బంది జరిగిందా?. వాళ్లకి గోంతేనమ్మ మీద ప్రేమ కాదు.. ఈయనకి శ్రీరాముడిపై ప్రేమ కాదు. ఇదంతా కేవలం ఐడెంటిటీ క్రైసిస్ మాత్రమే.. కనుక ఆకివీడు రామాలయం విషయంలో హిందువులు ఆందోళన పడవద్దు. చర్చిల విషయంలో క్రైస్తవులు ఆందోళన పడవద్దు' అన్నారు.'హిందువుల తరపున అని ఒకరు.. క్రైస్తవుల తరపున ఒకరు పోరాడేస్తున్నాం అని కలరింగ్ ఇస్తూ వాళ్ళ సొంత ఇగోల కోసం కొట్టుకుంటున్నారు. ఇది మనం అర్ధం చేసుకోకపోవడం వలన అమాయకులైన జనసేన కార్యకర్తలు గాయలపాలు అయ్యారు. అమాయక దళితులు జైలుపాలు అయ్యారు. పెద్దల కక్షలకోసం మనల్ని బలిపశువులను చేస్తున్నారు గమనించండి. ఈ ప్రభుత్వంలో ఏ కులానికి మతానికి అన్యాయం జరగదు.. CBN, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్లు ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వరు' అంటూ పోస్ట్ పెట్టారు.