తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న బండి సంజయ్ కుమారుడు .. రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. కీలక విషయాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసి.. వారి నుంచి మరింత సమాచారం సేకరించిన ఇచ్చారు. అయితే ఆయన ఇవాళ సిట్ విచారణకు హాజరు కాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.అతడిపై నమోదైన పోక్సో కేసులో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో విచారణ కోసం హాజరు కావాలని బండి భగీరథ్‌కు సిట్ అధికారులు మంగళవారం రోజున నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆచూకీ కనిపించడం లేదంటూ.. ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బండి భగీరథ్ సిట్ విచారణకు గైర్హాజరు కావడంతో.. ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. మరోవైపు.. ఇప్పుడు ఆ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు బండి భగీరథ్ ఎక్కడ ఉన్నాడు, అతడిని ఎవరైనా రక్షిస్తున్నారా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.ఇక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 74, 75.. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 11 రెడ్‌విత్‌ 12 కింద ఈ నెల 8వ తేదీన కేసు నమోదైన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని కఠినమైన 5(1) రెడ్‌ విత్‌ 6 సెక్షన్‌ను కూడా చేర్చారు. దీంతో ఈ కేసు మరింత రసవత్తంరంగా మారింది.