‘గోదావరి’ సీరియల్ టుడే ఎపిసోడ్: కర్రసాములో విజేతగా జాను.. నెరవేరిన తండ్రి కల.. ఇదేం ఓవరాక్షన్ బాబోయ్

Wait 5 sec.

శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా కర్రసాములో గెలిచి.. ఆంజనేయ స్వామి విగ్రహానికి తన తండ్రి చేతులపై అభిషేకం చేయించాలని అనుకుంటుంది జాను. ఇక ఈరోజు (మే 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. జాను కర్రతిప్పుతూ బరిలో ఉండటం చూసిన భువన.. ఇది ఆ దుబాయ్ వాడి కూతురా? పెంపకం సరిగా లేదు.. అందుకే ఇలా తయారైంది అని తమ్ముడు సింహాద్రితో అంటుంది భువన. నీ స్నేహితుడి కూతురు అని అంటున్నావ్.. నీపై పోటీ తమ్ముడూ అని అంటుంది భువన. ఏదో ఆడపిల్ల.. ఆకతాయిగా వచ్చింది అని అంటాడు సింహాద్రి. నువ్వు కర్రసాము కూడా చేస్తావా? అని పులిహోర కలుపుతుంటాడు సూర్య. అమ్మకూచివి కదా.. కందిపోతావ్ కాస్త దూరంగా ఉండు అని సూర్య గాలి తీసేస్తుంది జాను. ఇక పోటీ మొదలైన తరువాత.. శంకరనారాయణ తన ముగ్గురు కూతుళ్లని తీసుకుని పోటీలు జరిగే చోటికి వస్తాడు. అక్కడికే శంకరనారాయణ అక్కతో పాటు మేనల్లుడు మురళి కూడా వస్తాడు. ఎలా ఉన్నావ్ రా అంటూ మురళిని దగ్గరకు తీసుకుంటాడు. ఇక జాను కళ్లకి గంతలు కట్టుకుని బరిలోకి దిగుతుంది. సీన్ నామమాత్రంగానే ఉన్నా బిల్డప్ మాత్రం మామూలుగా ఉండదు. కర్రసాము గురించి అప్పుడే తెలుసుకుని.. అక్కడున్న కాకలు తీరిన పోటుగాళ్లందర్నీ ఓడించేస్తుంది జాను. ఆ సీన్ చూస్తే మాత్రం.. అరేయ్ ఏంట్రా ఇదీ అని అనిపించకమానదు. ఎగిరెగిరి కర్రసాము చేసేస్తుంది. ఇక కూతురు గెలవగానే.. జానూ అంటూ వెళ్తాడు శంకరనారాయణ. తండ్రిని చూడగానే.. ‘నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్నా’ అంటూ సాంగ్ వేసుకుంటుంది జాను. ఇక జాను గెలవగానే.. ‘ఎవరైనా తాను గెలవాలని బరిలోకి వస్తారు.. మీ కూతురు మాత్రం తండ్రిని గెలిపించడానికి బరిలోకి వచ్చింది’ అంటూ జానుని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇక పోటీలో గెలిచిన జానుకి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన భువన చేతుల మీదిగా ట్రోఫీ అందిస్తుంది. అయిష్టంగానే ఆ ట్రోఫీని ఇవ్వబోతుంది భువన. అయితే జాను.. ‘నేను మీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోను.. నా నాన్న చేతులపై ట్రోఫీ తీసుకుంటానంటూ మెలికపెడుతుంది. దాన్ని అవమానంగా భావిస్తుంది భువన. ఇక జాను మైక్ అందుకుని స్పీచ్ ఇస్తుంది. దాన్ని వదిలిపెట్టను.. ఇంతిలా అవమానిస్తుందా? పగతో రగిలిపోతుంది భువన. అది వాళ్ల నాన్నకి ఇచ్చే గౌరవం అనుకోవచ్చు కదమ్మా అని సముదాయిస్తాడు సూర్య. ఆ తరువాత జాను కోరుకున్నట్టుగా.. శంకరనారాయణ చేతులపైనే రాముల వారి కళ్యాణంతో పాటు.. ఆంజనేయుడికి అభిషేకం కూడా అయిపోతుంది. మొత్తానికి ఈ కొత్త సీరియల్ మూడో ఎపిసోడ్‌లో కంటెంట్ తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ అనేట్టుగానే ఉంది. ముఖ్యంగా ఆ ‘నువ్వేంటే నాజతగా’ సీరియల్ ఫేమ్ ఓవరాక్షన్ అయితే మామూలుగా లేదు. అక్కడేమో మిధునగా చిరాకు తెప్పించి.. చివరికి ఆ సీరియల్ మధ్యలోనే చాపచుట్టేసేట్టు చేసింది. ఇప్పుడు ఈ ‘’ని ఏం చేస్తుందో ఏమో అనేట్టుగానే ఉంది ఈమె పెర్ఫామెన్స్.