కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మైనర్ బాలికపై అత్యాచారం, వేధింపుల వంటి ఈ కేసులో సిట్ అధికారులు విచారణ కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ.. నిన్ననే ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ ఇప్పటివరకు విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. మరోవైపు.. ఇవాళ తెల్లవారుజామునే హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ (జేబీఎస్), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఖైరతాబాద్ వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో.. పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లపై బండి సంజయ్, బండి భగీరథ్ కలిసి ఉన్న ఫోటోలను ప్రింట్ చేయించారు. ఇక అందులో 'బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు!' అంటూ పైన రాసి ఉంది. ఇక కింద.. 'కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్‌లో తెలియజేయండి!' అని రాసి ఉంది.తెలుగుతోపాటు ఇంగ్లీష్‌లలో రాసి ఉన్న పోస్టర్లను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి అంటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోస్టర్లను బుధవారం రోజున తెల్లవారుజామున జీహెచ్ఎంసీ సిబ్బంది కొందరు తొలగించారు. ఈ క్రమంలోనే రోడ్లపై వెళ్తున్న పలువురు వాహనదారులు ఆగి.. ఎందుకు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించారు. మరోవైపు.. హైదరాబాద్ మెట్రో రైలులో కూడా కొంతమంది వ్యక్తులు.. పోస్టర్లు పట్టుకుని.. బండి భగీరథ్ అనే వ్యక్తి కనిపించడం లేదని.. తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రచారం చేశారు. ఇక గత కొన్ని రోజులుగా బండి భగీరథ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌ చేసి ఉంచాడని.. అతడి ఆచూకీ ఇంకా దొరకలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇక ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని సిట్.. బండి భగీరథ్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని మంగళవారం రోజునే నోటీసులు జారీ చేసినప్పటికీ.. అతడు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలంటూ.. బండి భగీరథ్‌ ఇటీవలె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. అయితే ఆ పిటిషన్ రేపు విచారణకు రానుంది.