: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ వాహనదారులకు ఊహించని షాక్ తగిలింది. అయితే, తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ఉపయోగించే వాహనదారులపై ప్రభావం పడనుంది. తాజాగా ప్రకటించింది. సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.2 చొప్పున పెంచుతున్నామని తెలిపింది. అయితే, ఈ పెంపు అనేది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో వర్తిస్తుంది. తాజా పెంపు తర్వాత కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.84కు చేరుకుంది. ఇంతకు ముందు కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.82గా ఉండగా సవరించిన ధరలు మే 14, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అలాగే భారత కరెన్సీ రూపాయి విలువ ఆల్ టైమ్ లో స్థాయికి పడిపోయింది. ఇంధర సరఫరాకు అంతరాయం ఏర్పడడం వంటి కారణాలతోనే సీఎన్‌జీ గ్యాస్ ధరలను పెంచాల్సి వస్తోందని ఎంజీఎల్ కంపెనీ తెలిపింది. మరోవైపు.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం సహా సమీప ప్రాంతంలో సీఎన్‌జీ సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సైతం ధరలు పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే ఈ కంపెనీ నుంచి సైతం ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఎంజీఎల్ పెంచిన రేట్లు ముంబై, ఠాణే, నావీ ముంబై, ఎంఎంఆర్ ప్రాంతాల్లో వర్తిస్తాయి. అంటే ముందు ముందు పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.77.09 గా ఉంది. ముంబై ప్రాంతంలో కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర తాజా పెంపుతో రూ.84కు చేరింది. చెన్నైలో కిలో సీఎన్‌జీ ధర రూ.91.50, బెంగళూరులో కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.90 వద్ద ఉన్నాయి.ఇక హైదరాబాద్ నగరంలో కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.97 గా ఉంది. భరత్‌పుర్‌లో కిలో గ్యాస్ రూ.92.50, దేవాస్‌లో రూ.96, ఫిరోజాబాద్‌లో రూ.93.85గా ధరలు ఉన్నాయి. మథురలో కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.93గా ఉండగా మీరట్‌లో రూ.86.05గా ఉంది. రేవారీలో రూ.81.71గా ఉండగా సోనిపట్‌లో రూ.86.60గా ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాతంలో కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.77.09గా ఉంది. అయితే, ముంబై ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ధరలు పెరగలేదు.