Keralam CM: కేరళం కొత్త సీఎంను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. వి.డి. సతీషన్ విశేషాలు ఇవే..!

Wait 5 sec.

: ఎంపిక విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. సీనియర్ నేత వి.డి. సతీషన్‌ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ నేతలు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ సమక్షంలో కేరళం కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ గుప్తా ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత.. కేరళం సీఎల్పీ కొత్త నాయకుడిగా సతీషన్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు.కేరళం సీఎం పదవి కోసం వి.డి.సతీషన్‌తోపాటు సీనియర్ నేతలైన కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల పోటీ పడ్డారు. దీంతో ఈ ముగ్గురిలో సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే విషయమై చాలా రోజులపాటు ఉత్కంఠ నడిచింది. సీఎం ఎవరనే విషయాన్ని ప్రకటించడంలో . అయితే కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే సతీషన్‌ను సీఎంగా ఎంపిక చేస్తారని చాలా మంది మళయాళీలు భావించారు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ నాయకత్వం కూడా చివరకు ఆయన వైపే మొగ్గు చూపింది.సతీషన్ వివరాలు..వి.డి. సతీషన్ పూర్తి పేరు వడస్సెరి దామోదరన్ సతీషన్. కొచ్చిలోని నాయర్ కుటుంబంలో 1964లో జన్మించిన సతీషన్.. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. నేషనల్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా పని చేశారు. 1996లో పరావూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సతీషన్.. సీపీఐ అభ్యర్థి పి.రాజు చేతిలో ఓడిపోయారు. కేరళ హైకోర్టులో అడ్వొకేట్‌గా పని చేస్తూనే.. 2001లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. 2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన చీఫ్ విప్‌గా పని చేశారు.2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన సతీషన్.. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. గ్రూపు రాజకీయాలను తగ్గించడంలో ఆయన చాలా వరకు సఫలం అయ్యారు. తన ప్రసంగాలతో యువత, మధ్యతరగతిని ఆకర్షించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి, ప్రచారం వరకు అన్నీ తానై నడిపించిన సతీషన్.. తనదైన వ్యూహాలతో కమ్యూనిస్టుల కోటల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. 2026 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సతీషన్‌ దంపతులకు రూ.6.69 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.మే 4న వెల్లడైన కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి 140 స్థానాలకు గానూ 102 సీట్లు గెలుపొందింది. అధికార ఎల్‌డీఎఫ్ కూటమి 35 సీట్లకే పరిమితమైంది. దీంతో పదేళ్ల విజయన్ సర్కారు పాలనకు తెరపడింది.గూగుల్ ట్రెండ్స్‌లో వి.డి.సతీషన్..కేరళ కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం వి.డి.సతీషన్‌ను ప్రకటించడంతో.. ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబర్చారు. దీంతో నిలిచింది. సతీషన్ సొంత రాష్ట్రమైన కేరళతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణల్లోనూ ఆయన గురించి గూగుల్‌లో వెతికారు.