: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఎలక్ట్రికల్ సెక్టార్ కంపెనీ వీ మార్క్ ఇండియా లిమిటెడ్ (V-Marc India Limited) తమ వాటాదారులకు శుభవార్త చెప్పింది. మే 11వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 5:1 రేషియోలో జారీ చేసేందుకు నిర్ణయించారు. వస్తాయి. అదనంగా రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఒకవేళ మీ వద్ద100 షేర్లు ఉంటే 500 షేర్స్ ఉచితంగా లభించడంతో మొత్తం 600 షేర్లు ఖాతాలో ఉంటాయి. ఆ తర్వాత షేరు ధర పెరిగితే 5 రెట్లు లాభం వస్తుంది. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలోనే ఏకంగా 259 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో తమ షేర్ హోల్డర్లకు 5:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 5 ఈక్విటీ షేర్లను ఉచితంగా జారీ చేస్తారు. అయితే దీనికి అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించే రికార్డు డేట్ త్వరలో ప్రకటించనున్నట్లు కంపెనీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తెలియజేసింది. చివరి ట్రేడింగ్ సెషన్లో వీ మార్క్ ఇండియా లిమిటెడ్ షేరు 4.08 శాతం లాభంతో రూ. 1179.85 వద్ద ముగిసింది. అలాగే ఈరోజు ట్రేడింగ్ చూసుకుంటే ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 1260 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 271.35 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 21 శాతం లాభాన్ని, గత నెల రోజుల్లో 58 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 52 శాతం లాభాన్ని ఇవ్వగా గత ఏడాది కాలంలో 259 శాతం లాభాన్ని అందించింది. గత ఐదేళ్ల కాలంలో 2961 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయల పెట్టుబడిని ఐదేళ్లలోనే ఏకంగ రూ.30 లక్షలకు పైగా చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 2943 కోట్లుగా ఉంది.