CM Vijay Floor Test Successm : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపట్టిన విజయ్.. బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో ఘన విజయం సాధించారు. మొత్తం 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ సర్కార్ తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యంగా బల పరీక్షకు సంబంధఇంచిన ఈరోజు ఉదయం విజయ్ సభలో తీర్మానం ప్రవేశ పెట్టగా.. దీనిపై చర్య జరిగింది. ఆ తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. అయితే సాధారణ ఓటింగ్ మాదిరిగా కాకుండా.. ఒక్కో సభ్యుడిని పిలిచి మరీ ఎమ్మెల్యే సమ్మతిని స్పీకర్ నమోదు చేసుకున్నారు. ఇలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ బల పరీక్ష గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 59 మంది ఎమ్మెల్యేలతో డీఎంకే వాకౌట్..బలపరీక్షకు ముందే అధికార డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్‌కు వ్యతిరేకంగా జరిగే ఈ ఓటింగ్‌లో తమ పార్టీ పాల్గొనడం లేదని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. టీవీకే ప్రభుత్వానికి మెజార్టీయే లేదని.. తమ కూటమి మద్దతు వల్లే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని చెప్పారు. మెజార్టీ సాధించేందుకు విజయ్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు. దీని వల్ల రాష్ట్రం పరువు పోతుందంటూ.. డీఎంకేకు చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభ మొత్తం బలం 233 నుంచి గణనీయంగా తగ్గింది. ఇది పరోక్షంగా విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మెజారిటీ మార్కును సులభతరం చేసింది.అన్నాడీఎంకేలో గందరగోళం..మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఈ బలపరీక్షను తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా పళని స్వామి మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలకు విజయ్ డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదంటూనే.. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ విజయ్‌కు వ్యతిరేకంగానే ఓటు వేస్తారని ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. మరోవైపు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు దీనిపై స్పందిస్తూ.. తమకెవరూ డబ్బులు ఆఫర్ చేయలేదని, మనస్ఫూర్తిగానే విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకించారు. కూటమి ప్రభుత్వానికి బలమైన మద్దతుగత నెలలో జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 స్థానాలకు 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతుతో తమిళనాడులో తొలి సారిగా ఒక ప్రత్యేక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మొత్తంగా 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో.. సీఎం అయ్యారు. కానీ తాజాగా ఒకే ఒక్క ఓటుతో గెలిచిన మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మంగళవారంకు టీవీకేకు 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. ఉత్కంఠ నెలకొంది. కానీ డీఎంకే వాకౌట్‌తో ఈరోజు సభా బలం తగ్గిపోయింది. ఇలా బల పరీక్షలో 144 మంది ఎమ్మెల్యేల అండతో విజయ్ తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకున్నారు.