టాప్ 4 టీమ్స్‌ని పడగొట్టి.. టేబుల్ టాపర్‌గా తొడగొట్టిన గుజరాత్, గిల్ సేన వరుసగా 5 విజయాలు

Wait 5 sec.

అంటేనే ఒక స్థిరత్వం. 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సంవత్సరమే టైటిల్ అందుకుంది. 2023లో రన్నరప్‌గా నిలవగా.. 2024లో మాత్రం పాయింట్స్ టేబుల్ దిగువకు వెళ్లింది. 2025లో ప్లే ఆఫ్స్‌కి వచ్చిన . మొదటి ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడే గెలిచిన గుజరాత్.. ఇప్పుడు ఆఖరి ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి సత్తా చాటింది. గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్ 4లో నిలిచిన ప్రతీ జట్టును ఓడించి మరీ టేబుల్ టాపర్‌గా తొడగొట్టడం ఒక్క గిల్ సేనకే చెల్లింది. ఆర్సీబీతో మొదలుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ వరకూ ప్రతీ జట్టునూ ఓడించి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టేబుల్ టాపర్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో 16 పాయింట్లు సాధించిన గుజరాత్ టైటాన్స్ +0.551 నెట్ రన్‌రేట్‌తో అగ్ర స్థానంలో ఉంది. మొదటి ఏడు మ్యాచ్‌లలో పంజాబ్, రాజస్థాన్, ముంబై, ఆర్సీబీపై ఓటమిపాలైన గుజరాత్ రివేంజ్ రౌండ్‌లో ఒక్కొక్క జట్టును ఓడించుకుంటూ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మొదలైన గుజరాత్ విజయ ప్రస్థానం.. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వరకూ కొనసాగింది. ఇప్పటికే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ సేఫ్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ మరోసారి తలపడనుంది. ఈ రెండు జట్లను ఓడించిన గుజరాత్ మరోసారి గెలిచి అత్యధిక పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని చూస్తోంది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ తన చివరి రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే 20 పాయింట్లతో టాప్ ప్లేస్‌కి చేరుకునే అవకాశం ఉంది.