లో ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ కన్పార్మ్ చేసుకోవడానికి చూస్తుంటే.. ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగడానికి కేకేఆర్ ప్రయత్నిస్తోంది. తొలి ఆరు మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా సాధించని కోల్‌కతా.. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తుంటే.. ఎలాంటి సిచ్యుయేషన్ నుంచి అయినా కమ్ బ్యాక్ ఇస్తూ ఆర్సీబీ అందరికీ హడల్ పుట్టిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంలా కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెకండ్ హోం రాయ్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ - కేకేఆర్ మధ్య మొత్తం 35 మ్యాచ్‌లు జరిగాయి. అందులో కోల్‌కతా అత్యధికంగా 20 మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఆర్సీబీ 15 మ్యాచ్‌లలో గెలిచింది. 2023 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లలోనూ కేకేఆర్‌దే పైచేయి. నాలుగు మ్యాచ్‌లలో కేకేఆర్ విజయం సాధించగా, ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆర్సీబీ తన మిగతా మూడు మ్యాచ్‌లలో ఒకటి కచ్చితంగా గెలవాల్సి ఉండగా.. కేకేఆర్ తన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు చేరుకోనుంది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ఆర్సీబీ జట్టు అంచనావిరాట్ కోహ్లి, జేకబ్ బెతెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ / రొమారియో షెఫర్డ్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ దార్ / జాకబ్ డప్ఫీ. కేకేఆర్ జట్టు అంచనాఅజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి / నవదీప్ సైనీ.