Gold Futures Price: బంగారం కొనుగోలుదారులకు అలర్ట్. దేశీయంగా ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. దానికి అనుగుణంగా ధరలు ఎగబాకాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర వార్త రాస్తున్న సమయంలో మే 13న ఉదయం 10 గంటలకు రూ. 12,750 పెరిగి తులం రూ. 1,53,900 కు చేరింది. కిందటి రోజు రూ. 1,41,150 వద్దే ఉండేది. గత రెండు రోజుల్లో చూస్తే రూ. 500, రూ. 1000 మేర పెరిగాయి. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర చూస్తే ఇవాళ రూ. 13,910 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,67,890 కి చేరింది. చాలా రోజుల తర్వాత ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరిగాయని చెప్పొచ్చు. దీంతో సామాన్యులకు ఇప్పుడు బంగారం కొనడం మరింత కష్టంగా మారుతుంది. మరోవైపు వెండి ధర (Hyderabad Silver Rate Today) రికార్డు స్థాయిలో రూ. 30 వేలు పెరిగి కేజీకి రూ. 3.30 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. MCX Gold Price:ఇదిలా ఉండగా.. ఫ్యూచర్స్ ధరల్ని తెలిపే ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కేంద్రం ప్రకటన వచ్చిన నిమిషాల్లోనే రికార్డు స్థాయిలో ఎగబాకాయి. జూన్ 5 ఎక్స్‌పైరీ డేట్‌గా ఉన్న ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ప్రైస్ నిమిషాల్లోనే రూ. 11 వేలకుపైగా పెరిగింది. ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఇక జులై 3 ఎక్స్‌పైరీగా ఉన్న ఎంసీఎక్స్ సిల్వర్ ప్రైస్ రూ. 22 వేలకుపైగా పెరిగింది. ఇది కూడా 7 శాతానికిపైగా పెరిగిందని చెప్పొచ్చు. ఎంసీఎక్స్ అంటే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజి. ఇది భారతదేశ అతిపెద్ద కమోడిటీ ఎక్స్చేంజి. ఇక్కడ బంగారం, వెండి లైవ్ ట్రేడింగ్ జరుగుతుంటుంది. ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. మార్కెట్ ట్రేడింగ్ యాక్టివిటీ సహా అంతర్జాతీయ, దేశీయ పరిణామాల ఆధారంగా ఈ ధర క్షణక్షణం మారుతుంటుంది. International Gold Prices:ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక్కడ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4700 డాలర్ల స్థాయిలోనే ఉంది. సిల్వర్ రేటు 86 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.69 వద్ద ట్రేడవుతోంది. ఇది ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి అని చెప్పొచ్చు. మోదీ ప్రకటనతో మొదలు..కొద్ది రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీ.. . ఇందులో భాగంగానే తాజాగా దిగుమతుల్ని నియంత్రించేందుకు బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాల్ని 6 శాతం నుంచి ఒక్కసారిగా రాత్రికి రాత్రే 15 శాతానికి పెంచింది. ఈ క్రమంలోనే ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు కనిపించింది.