హైదరాబాద్‌లో నీళ్లకు డిమాండ్.. ఈ ఏరియాల్లో ట్యాంకర్లకు గిరాకీ, రోజుకు ఎన్ని ట్యాంకర్లో తెలుసా!

Wait 5 sec.

హైదరాబాద్‌పై వేసవికాలం ఎఫెక్ట్ కనిపిస్తోంది.. బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నీళ్లకు డిమాండ్ పెరిగింది. నగరంలో ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది.. కొద్దిరోజులుగా బుకింగ్‌లు చాలా పెరిగాయి. ఈ క్రమంలో వాటర్ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట గృహ అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. రాత్రి వేళల్లో కమర్షియల్ అవసరాల కోసం నీళ్లను సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నీళ్ల ట్యాంకర్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో రోజుకు ఏకంగా 11వేలకు పైగా ట్రిప్పుల నీళ్లు డెలివరీ చేస్తున్నారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న 24 గంటల్లోనే ట్యాంకర్ అందిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ట్యాంకర్లు ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. గ్రేటర్‌ నగరం పరిధిలో 30 ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. నిజాంపేట, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, వెంకటగిరి, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, హఫీజ్‌పేట, మణికొండ, గచ్చిబౌలి, టీఎన్‌జీఓస్ కాలనీ, షేక్‌పేట వంటి ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని వాటర్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 11233 ట్యాంకర్ల ద్వారా 11వేల ట్రిప్పులు నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా మొత్తం 84 ఫిల్లింగ్‌ స్టేషన్ల వారీగా సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ విభాగం ద్వారాడాష్‌ బోర్డును సిద్ధం చేయించారు. ఒకవేళ బుకింగ్‌లు ఏవైనా పెండింగ్ ఉంటే తెలిసేలా ప్లాన్ చేశారు.వంద లోపు బుకింగ్స్ పెండింగ్‌ ఉంటే ఓ కలర్, అదే 200 వరకు పెండింగ్ ఉంటే మరో కలర్, 200లకు పైగా ట్యాంకర్ల పెండింగ్‌‌లో ఉంటే మరో కలర్ ఉండేలా రూపొందించారు. ఇలా ట్యాంకర్లకు సంబంధించిన వివరాలు డిస్‌ప్లే అవుతున్నాయి. ఒకవేళ పెండింగ్ ఉంటే.. ఆయా వాటర్ ఫిల్లింగ్‌ స్టేషన్ల వారీగా అధికారులను అలర్ట్‌ చేస్తారు. రోజువారీ బుకింగ్‌లతో పాటుగా డెలివరీ, పెండింగ్ ఉన్నవి ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా బుకింగ్స్ పెండిగ్ ఉంటే కారణాలు తెలుసుకుని వారికి 24 గంటల్లోగా ట్యాంకర్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా ట్యాంకర్లు పంపేందుకు అర్ధరాత్రి వరకు ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. అవరసమైన చోట్ల ఫిల్లింగ్ స్టేషన్లను పెంచారు.