: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తోడు.. .. స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. వరుస సెషన్లలో దారుణంగా పతనం అవుతున్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లో స్టాక్ మార్కెట్లు కుదేలైన సంగతి తెలిసిందే. మంగళవారం రోజు (మే 12) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ (BSE Sensex) 1456 పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 430 పాయింట్లకుపైగా కుదేలైంది. ఈ క్రమంలో ఒక్కరోజులోనే మదుపరుల సంపదగా పరిగణించే.. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 11.28 లక్షల కోట్లు తగ్గి రూ. 456 లక్షల కోట్లకు చేరింది. ఈ ఒక్కరోజులోనే కాదు.. అంతకుముందు సెషన్‌లో కూడా భారీగానే పతనం అయ్యాయి. మే 11న (సోమవారం సెషన్) సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా దిగొచ్చింది. ఇలా వరుసగా పతనం అవుతూనే ఉన్నాయి. గత 4 ట్రేడింగ్ సెషన్లలో చూస్తే (మే 7, 8, 11, 12) సెన్సెక్స్ 3400 పాయింట్లు తగ్గింది. ఈ క్రమంలో 4 రోజుల్లో సుమారు రూ. 17 లక్షల కోట్ల వరకు తగ్గుముఖం పట్టింది. ఆ మేరకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం- క్యాప్ తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడ .. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం ఒక కారణం కాగా.. మరోవైపు భారత ప్రధాని పొదుపు చర్యల ప్రకటనలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ (Rupee All Time Low) భారీగా పడుతుండటం వంటివి స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. PM Modi Appeal to Nation:ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పెట్రోల్, గ్యాస్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఇంకా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. .. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గించుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే ఆయా రంగాలకు సంబంధించి వినియోగ ఆధారిత కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. చమురుకు సంబంధించి రిలయన్స్ షేర్లు, విదేశీ ప్రయాణాలు తగ్గుతాయన్న ఆందోళనలతో స్పైస్ జెట్, ఇండిగో షేర్లు, బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుందన్న ఆందోళనలతో.. కుదేలవుతున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం (US Iran War)అంతకుముందు పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పుడు మార్చి నెలలో సూచీలు భారీగా కుదేలవగా.. మళ్లీ ఏప్రిల్‌లో కాస్త రాణించాయి. ఇప్పుడు ఆ లాభాల్ని తుడిచిపెట్టేలా సూచీలు వరుస సెషన్లలో క్రాష్ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక విశ్లేషకులు.. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. మున్ముందు పెద్ద క్రాష్ ఉంటుందన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. రూపాయి భారీ పతనం (Rupee vs US Dollar)ముఖ్యంగా డాలరుతో పోలిస్తే రూపాయి జీవన కాల కనిష్ఠాలకు పడిపోతుండటం, పెరుగుతున్న దిగుమతుల బిల్లు, అధిక ద్రవ్యోల్బణం భయాల్ని మరింత పెంచుతుందని చెబుతున్నారు. ఇటీవల ముడి చమురు, వంట నూనెలు, బంగారం దిగుమతులు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థపైన పడుతున్న ఒత్తిడిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పదేపదే ప్రస్తావిస్తుండటంతో భారతదేశ విదేశీ మారక నిల్వల (Foreign Exchange Reserves) గురించి ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇదో వార్నింగ్ బెల్ అని.. ముందు ఇంకా పెద్ద క్రాష్ ఉండొచ్చనట్లుగా హింట్ ఇస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి.. శాంతి దిశగా అమెరికా- ఇరాన్ అడుగులు వేస్తే.. క్రూడాయిల్ ధరలు, బంగారం ధరలు తగ్గితే.. సానుకూల పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.