లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ను 168/5 పరుగులకే సన్‌రైజర్స్ హైదరాబాద్ కట్టడి చేసింది. ఈజీ టార్గెట్‌ను ఆరెంజ్ ఆర్మీ ఊదేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, గుజరాత్ బౌలర్లు మ్యాచ్‌కి కాసేపట్లోనే తమవైపునకు తిప్పుకున్నారు. కిందపడిన సన్‌రైజర్స్‌ను కనీసం కోలుకోనీకుండానే మ్యాచ్‌ని ముగించేసింది. సిరాజ్ మంచి ఆరంభం ఇవ్వగా రబడా, హోల్డర్ సన్‌రైజర్స్ పతనాన్ని శాసించారు.మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే వికెట్ తీయడంతో పాటు మెయిడిన్ కూడా చేసి అద్భుత ఆరంభం ఇచ్చాడు. అయితే, రెండో ఓవర్ మొదటి బంతినే అభిషేక్ శర్మ సిక్సర్‌గా మలిచాడు. దాంతో ఆరెంజ్ ఆర్మీ మళ్లీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. ఆ ఆనందం కాసేపు కూడా లేకుండా చేశాడు . వరుసగా రెండు బంతులు డాట్ చేసిన రబడా.. నాలుగో బంతిని తెలివిగా వేయడంతో అది అభిషేక్ శర్మ బ్యాట్ తగిలి వికెట్లను తాకింది. దాంతో రెండో ఓవర్‌లో మరో బ్రేక్ త్రూ లభించింది. మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు లభించడంతో కెప్టెన్ గిల్ పేసర్లతోనే పవర్ ప్లే పూర్తి చేయించాడు. నాలుగో ఓవర్ వేసిన రబడా తొలి బంతికే ఇషాన్ కిషన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్‌కు పంపాడు. దాంతో రబడాకి వికెట్లు దక్కుతుండటంతో గిల్ స్పెల్ కంటిన్యూ చేయించాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్ ఆరో ఓవర్‌ను కూడా రబడాతోనే బౌలింగ్ చేయించడంతో సమరన్ రవిచంద్రన్ కూడా దొరికిపోయాడు. 8వ ఓవర్ కూడా రబడా వేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రబడా 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అందులో అభిషేక్, ఇషాన్‌తో పాటు సమరన్ కూడా ఉన్నాడు. మొత్తం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేసి గేమ్ ఛేంజర్‌గా మారాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. రబడాతో పాటు జేసన్ హోల్డర్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన హోల్డర్ కేవలం 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ 2, రషీద్ ఖాన్, సిరాజ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. దాంతో సన్‌రైజర్స్ 86 పరుగులకే ఆలౌట్ అయింది.