కేంద్రం బిగ్ షాక్.. బంగారంపై సుంకాలు డబుల్.. భారీగా పెరగనున్న ధరలు.. మోదీ పిలుపుతో!

Wait 5 sec.

Modi Gold Purchase: అనుకున్నదే జరిగింది. కొద్దిరోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీ.. పలు సంచలన ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను సంవత్సరం పాటు నిలిపి వేయాలని పిలుపునిచ్చారు. పెళ్ళిళ్లు, పండగల సమయంలోనూ కొనమని ప్రతిజ్ఞ చేయాలన్నారు. దీనితో పాటు ఇంకా చమురు వాడకం తగ్గించాలని కూడా చెప్పారు. దీంతో దేశంలో ఏం జరుగుతుందో అని అంతా కంగారు పడ్డారు. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మారకాన్ని ఆదా చేసుకునేందుకు ఇలా చేయాలని మోదీ పేర్కొన్నారు. ఇక దీనిని విధానపరంగా అమలు చేసే దిశగా కేంద్రం రాత్రికి రాత్రే సడెన్ షాక్ ఇచ్చింది. బంగారం, వెండి, ప్లాటినం సహా ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాల్ని భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. మే 13 అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేసింది.అంతకుముందు బంగారం, వెండి వంటి లోహాలపై దిగుమతి సుంకం 6 శాతంగా ఉండగా.. దీనిని ఇప్పుడు ఒకేసారి 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5 శాతం నుంచి 10 శాతానికి పెరగ్గా.. అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 1 శాతం నుంచి 5 శాతానికి చేరింది. ఇలా మొత్తంగా 15 శాతానికి ఎగబాకింది. కేంద్రం నిర్ణయంతో గోల్డ్, సిల్వర్ సహా ఇతర విలువైన లోహాల ధరలు పెరుగుతాయని చెప్పొచ్చు. ప్రధానంగా బంగారం, వెండి లోహాల దిగుమతుల్ని తగ్గించేందుకు కేంద్రం.. ఇప్పుడు సుంకాల్ని పెంచిందని చెప్పొచ్చు. భారత్.. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే చైనాతో కలిసి ముందు వరుసలో ఉంటుంది. ఇంకా ఎక్కువ భాగం ఇక్కడ దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి దిగుమతుల బిల్లు ఎక్కువ అవుతుంది. దీనిని ఇంకా డాలర్లలో కొనుగోలు చేయాల్సి వస్తుంది. అప్పుడు విదేశీ మారక ద్రవ్యం తగ్గుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు.. దీనిని ఆదా చేసేందుకు దిగుమతుల్ని నియంత్రించేలా సుంకాల్ని పెంచిందని చెప్పొచ్చు.