ట్రావిస్ హెడ్ అలా అవుటయ్యాడేంటీ.. లెగ్ సైడ్ ఆడితే ఆఫ్ సైడ్ బౌండరీ దగ్గర క్యాచ్ లేచిందిగా!

Wait 5 sec.

మీద అవుటైన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు షాట్ ఒకవైపు ఆడితే అది ఇంకో వైపు గాల్లో లేవడం ఎవ్వరికీ అర్థం కాలేదు. ట్రావిస్ హెడ్‌తో పాటు నాన్ స్ట్రయిక్‌లో ఉన్న అభిషేక్ శర్మ కూడా అవాక్కయ్యాడు. వరుసగా మూడు బంతులు డాట్ కాగా.. నాలుగో బంతికి షాట్ ఆడే ప్రయత్నంలో జరిగిన ఈ మిస్టేక్ మొత్తం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బలమంతా బ్యాటర్లే. అది కూడా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఈ ఇద్దరూ కాసేపు క్రీజులో ఉంటే మ్యాచ్ ఫలితమే మారిపోతుంది. పవర్ ప్లే వరకూ ఈ ఇద్దరూ అవుట్ కాకుండా ఉంటే స్కోర్ బోర్డు 90 పరుగులు రీచ్ అవడం చాలా ఈజీ. కానీ.. ఈ ఇద్దరూ పవర్ ప్లేలోనే అవుటైతే మ్యాచ్ దాదాపూ ఓడిపోయినట్టే లెక్క. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది. వేసిన తొలి ఓవర్‌లో ట్రావిస్ హెడ్ అష్టకష్టాలు పడ్డాడు. మొదటి బంతి నుంచే వికెట్ తీసుకోవాలన్న లక్ష్యంగా సిరాజ్ బౌలింగ్ చేశాడు. మొదటి రెండు బంతులను అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయగా.. మూడో బంతిని వికెట్లకు వేశాడు. నాలుగో బంతిని ప్యాడ్స్ టార్గెట్‌గా వేయగా.. ట్రావిస్ హెడ్ దాన్ని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. హెడ్ లెగ్ సైడ్ షాట్ ఆడితే అది ఆఫ్ సైడ్ గాల్లోకి లేచింది. అదీ కూడా ఏదో మిడిల్‌‌లోనో, స్ట్రయిటో కాదు.. ఆఫ్ సైడ్ బౌండరీ దగ్గరకు వెళ్లింది. దాంతో అక్కడే ఫీల్డింగ్‌లో ఉన్న నిశాంత్ సింధూ ఆ బంతిని డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. హెడ్ అవుటైన తీరుకు నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ నోరెళ్లబెట్టాడు. అదేంటీ లెగ్ సైడ్ షాట్ ఆడితే అది ఆఫ్ సైడ్ బౌండరీ దగ్గరకు క్యాచ్ వెళ్లిందని అనుకున్నాడు. హెడ్ కూడా నిరాశగానే పెవిలియన్ బాట పట్టాడు. తొలి ఓవర్‌లోనే సున్నా పరుగులకు మొదటి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ పేస్ బౌలింగ్ దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ కుదేలయింది. క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా అవుటవ్వడంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కాసేపు ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దాంతో 169 పరుగుల లక్ష్యం ముందు 86 పరుగులకే ఆలౌట్ అయింది.