Sarvodaya Co- Operative Bank License Cancelled: దేశంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు (సహకార బ్యాంకులు) సహా ఇతర ఆర్థిక సంస్థలు ఇలా అన్నింటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ మార్గదర్శకాల్ని తప్పకుండా పాటించాలి. వాటి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇక బ్యాంకింగ్ సేవల పట్ల ఏమైనా నిర్లక్ష్యంగా ఉన్నా.. కస్టమర్లకు సంతృప్తికరంగా సేవలు అందించకున్నా.. నిబంధనల్ని ఉల్లంఘించినా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. ఇంకా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా చర్యలకు వెనుకాడదు. చాలా వరకు జరిమానాలతో సరిపెట్టినా.. కొన్ని సార్లు లైసెన్స్ కూడా రద్దు చేస్తుంది. . ఎక్కువగా సహకార బ్యాంకులు (Co- Operative Banks) ఈ జాబితాలో ఉంటాయి. తాజాగా ఆర్బీఐ ఇదే పని చేసింది. ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సర్వోదయ కో- ఆపరేటివ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బ్యాంక్ దగ్గర తగినంత మూలధనం లేదని.. భవిష్యత్తులో కూడా లాభాలు గడిస్తాయన్న అంచనాలు లేవని.. ఈ కారణంతోనే లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ () ఒక ప్రకటనలో తెలిపింది. మే 12న పని వేళలు ముగిసినప్పటి నుంచే ఈ సహకార బ్యాంకు.. ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. తమ రెగ్యులేటరీ నిబంధనల్ని పాటించని కారణంగా.. భవిష్యత్తులోనూ కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది కేంద్ర బ్యాంకు.ఇక్కడ చట్టపరంగా మూసివేస్తుంది కాబట్టి.. బ్యాంక్ ఆస్తుల్ని అమ్మి.. అప్పులు తీర్చేందుకు లిక్విడేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించాలని మహారాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, కమిషనర్ ఫర్ కోఆపరేషన్‌ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని కోరింది. వీరినే బ్యాంక్ లిక్విడేటర్ అంటారు. ఆ తర్వాత డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తారు. డిపాజిటర్ల డబ్బుల సంగతేంటి?సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాంక్ దివాలా తీసినప్పుడు లేదా లైసెన్స్ రద్దు చేసినప్పుడు ప్రతి డిపాజిటర్‌కు బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద.. గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు డిపాజిట్ చేసిన వారికి డబ్బులు (DICGC Payments) తిరిగొస్తాయి. ఆపైన ఎంత డిపాజిట్ ఉన్నా.. గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకే వెనక్కి వస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే బ్యాంక్ సబ్మిట్ చేసిన డేటా ప్రకారం.. డీఐసీజీసీ కింద 98.36 శాతం వరకు డిపాజిటర్లు పూర్తి స్థాయిలో తమ డిపాజిట్లను పొందనున్నారు.