8వ పే కమిషన్ అప్డేట్.. NPS ఉద్యోగులకు 50 శాతం గ్యారెంటీ పెన్షన్.. కీలక ప్రతిపాదనలు ఇవే!

Wait 5 sec.

8th CPC pension update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది జాతీయ పింఛను పథకం (NPS)లోనే ఉన్నారు. పాత పెన్షన్ పథకం స్థానంలో ఈ కొత్త పెన్షన్ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లలో చాలా మంది 2033 నుంచి ఉద్యోగ విరమణ చేయనున్నారు. గ్యారెంటీ పెన్షన్ వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మార్కెట్ లింక్డ్ రిటర్న్స్, ద్రవ్యోల్బణం రిస్క్ కారణంగా చాలా మంది ఉద్యోగులు సరిపడ డబ్బులు అందకుండానే రిటైర్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.50 శాతం గ్యారెంటీ పెన్షన్ఎన్‌పీఎస్‌లో ఉన్న ఉద్యోగుల తరపున 8వ వేతన సంఘానికి ఏఐఎన్‌పీఎస్ఈఎఫ్ మెమోరండం అందించింది. చివరి సారిగా తీసుకున్న జీతంలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్‌తో పాటు డియర్‌నెస్ అలవెన్స్ వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఒక వేళ పెన్షనర్ మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్‌లో భాగంగా కుటుంబ సభ్యులకు 60 శాతం పెన్షన్ అమౌంట్ చెల్లించాలని కోరింది. ఏఐఎన్‌పీఎస్ఈఎఫ్ ప్రకారం ఉద్యోగుల NPS ఖాతాలకు ప్రభుత్వం చెల్లించే వాటాను తన వద్దే ఉంచుకుని, దానికి బదులుగా పదవీ విరమణ చేసిన వారికి హామీతో కూడిన నెలవారీ పింఛను ప్రయోజనాలను అందించాలి. ప్రస్తుతం ఉద్యోగులు తమ బేసిక్ పే, డిఏలో 10 శాతం ఎన్‌పీఎస్ టైర్-I ఖాతాలకు చెల్లిస్తుండగా ప్రభుత్వం 14 శాతం అందిస్తోంది.ఎన్‌పీఎస్ పెన్షన్‌లో మార్పులు చేయాలి ఉద్యోగుల ఫెడరేషన్ పేర్కొంది. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్ వర్క్ అనేది 30-35 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అనుకూలంగా ఉందని, కానీ, తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు బెనిఫిట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. రెగ్యులర్ సర్వీస్ పీరియడ్స్ ఉన్న ఉద్యోగులు చాలా తక్కువ పెన్షన్ అందుకోవచ్చని తెలిపింది. అందుకే ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు చేయాలని కోరింది. తక్కువ పే ఉన్న ఉద్యోగులు టీచర్లు, రైల్వే స్టాఫ్, నిర్మాణ రంగ వర్కర్లు, రోజువారీ వేతన ఉద్యోగులు వంటి వారికి ఇది అనుకూలంగా లేదని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పెన్షన్ రూ.300 నుంచి రూ.3000 లోపే ఉంటోందని తెలిపింది. ప్రభుత్వ వాటాను కొనసాగించడం ద్వారా సైక్లికల్ ఫైనాన్షియల్ రికవరీ మెకానిజాన్ని సృష్టించవచ్చని, హామీతో కూడిన పెన్షన్ చెల్లింపులను చేయడంలో ఇది సహాయపడగలదని ఫెడరేషన్ వాదిస్తోంది. AINPSEF ప్రకారం ప్రతిపాదిత నమూనా పాత పింఛను పథకం (OPS), ప్రస్తుత NPS నిర్మాణం మధ్య ఒక మధ్యేమార్గాన్ని అందించడంతో పాటు, పదవీ విరమణ చేసిన వారికి సామాజిక భద్రతను మెరుగుపరుస్తుంది.