ఏపీ డిప్యూటీ సీఎం (Deputy CM ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని విద్యార్థులకు తీపికబురు వినిపించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. పరిధిలోని విద్యార్థులకు వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని తన జీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. .. వారి అభిరుచికి అనుగుణంగా ఉచితంగా ఉన్నత విద్యను చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పది పరీక్షల్లో 580 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ప్రతినెలా పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. వీరితో పాటుగా పిఠాపురం నియోజకవర్గంలోని 31 మంది విద్యార్థులు 580కిపైగా మార్కులు సాధించారు. ఓ విద్యార్థి 598 మార్కులు సాధించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో వీరి ప్రతిభను గుర్తించిన పవన్ కళ్యాణ్.. వీరిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నత చదువులకు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కాలేజీలు ఎంపిక చేసుకునే వెసులుబాటును పవన్ కళ్యాణ్ కల్పించారు. ఆయా కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి 31 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించేలా పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేశారు. మరోవైపు తాను అడిగిన వెంటనే పిఠాపురం విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థలకుపవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. విద్యార్థులు చదువులో ఉత్తమంగా రాణించాలని సూచించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.