కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను ఇవాళ విచారణకు రావాలంటూ ఆచూకీ కనిపించడం లేదంటూ ఆరోపణలు వస్తున్న వేళ.. సిట్‌కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ సిట్ విచారణకు రాలేకపోతున్నానని.. ఎల్లుండి అన్ని కీలక ఆధారాలతో వస్తానని బండి భగీరథ్ లేఖ పేర్కొన్నారు. నిజానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సిట్ విచారణ కోసం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ బండి భగీరథ్ రాలేదు. సిట్ విచారణకు గైర్హాజరు అయిన నేపథ్యంలో తాజాగా బండి భగీరథ్ సిట్ అధికారులకు ఒక లేఖ రాయడం గమనార్హం. తాను వ్యక్తిగత కారణాల వల్ల సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. శుక్రవారం రోజున విచారణకు వస్తానని స్పష్టం చేశారు. అయితే తనపై నమోదైన పోక్సో కేసులో తన వద్ద ఉన్న అన్ని కీలక ఆధారాలతో విచారణ అధికారుల ముందుకు వస్తానని పేర్కొన్నారు. తనపై నమోదైన పోక్సో కేసులో పూర్తిస్థాయిలో విచారణకు సహకరిస్తానని తేల్చి చెప్పారు.మరోవైపు.. ఈ పోక్సో కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బండి భగీరథ్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్‌ను మంగళవారం దాఖలు చేయగా.. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉండటంతో.. గురువారం రోజున వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూసిన తర్వాత సిట్ విచారణకు హాజరు కావాలని.. బండి భగీరథ్ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ కేసులో సిట్ అధికారులు రెండోసారి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో కఠినమైన పోక్సో సెక్షన్లను అదనంగా చేర్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. మారింది. ఆమెకు రెండు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్లు వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఎల్లుండి బండి భగీరథ్ విచారణ సమయంలో.. ఎలాంటి ఆధారాలను సమర్పిస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.